Business Ideas: ఇప్పుడు ఒక ఇంట్లో రెండు, మూడు ఫోన్లు ఉండటం సాధారణమైంది. ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల చిన్నచిన్న సమస్యలు కూడా తరచుగా వస్తున్నాయి. అందుకే మొబైల్ రిపేర్ సేవలకు మంచి డిమాండ్ పెరిగింది. ఈ అవసరాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటే లాభాలే లాభాలు.
ఈ రోజుల్లో ప్రతి వీధిలో మొబైల్ రిపేర్ దుకాణం కనిపిస్తోంది. అయినా కూడా డిమాండ్ తగ్గడం లేదు. కారణం ఫోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటమే. చాలా మంది తమ ఫోన్‌లో డేటా, ఫోటోలు, వ్యక్తిగత సమాచారం ఉండటం వల్ల దుకాణంలో ఫోన్ ఇవ్వడానికి కొంత భయపడతారు. కొందరికి ఫోన్ ఇచ్చాక ఎప్పుడు వస్తుందో అనే సందేహం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వద్దకే వచ్చి ఫోన్ రిపేర్ చేసే సేవలు అందిస్తే కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
25
ఇంటి వద్ద మొబైల్ రిపేర్ సేవ – మంచి బిజినెస్ ఐడియా
ఈ వ్యాపారం ప్రత్యేకత ఏమిటంటే కస్టమర్ ఇంటి వద్దకే వెళ్లి ఫోన్ రిపేర్ చేయడం. ముందుగా కస్టమర్ మీకు ఫోన్ చేస్తాడు. తన ఫోన్‌లో ఉన్న సమస్య ఏమిటో వివరిస్తాడు. అవసరమైతే వాట్సాప్‌లో ఫోటోలు కూడా పంపవచ్చు. సమస్యను బట్టి రిపేర్ ఖర్చు ఎంత అవుతుందో ముందే చెప్పవచ్చు. కస్టమర్ అంగీకరిస్తే వెంటనే అతని అడ్రస్‌కు వెళ్లి అతని ముందే ఫోన్ రిపేర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల కస్టమర్‌కు నమ్మకం పెరుగుతుంది.
35
ప్రారంభానికి అవసరమైన మొబైల్ రిపేర్ కిట్
ఈ వ్యాపారం ప్రారంభించాలంటే పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ముందుగా ఒక మొబైల్ రిపేర్ కిట్ సిద్ధం చేసుకోవాలి. ఇందులో స్క్రూ డ్రైవర్స్ సెట్, ఓపెనింగ్ టూల్స్, టెస్టింగ్ పరికరాలు, చిన్న స్పేర్ పార్ట్స్, స్క్రీన్ గ్లూ, క్లీనింగ్ పరికరాలు వంటి వస్తువులు ఉండాలి. ఇవి ఉంటే చాలా సాధారణ రిపేర్లు సులభంగా చేయవచ్చు. మీరు మొబైల్ రిపేర్ పనిలో అనుభవం కలిగి ఉంటే ఈ వ్యాపారాన్ని వెంటనే ప్రారంభించవచ్చు.
ఈ సేవ గురించి ఎక్కువ మందికి తెలియాలంటే మొదట ప్రచారం అవసరం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను ఉపయోగించి మీ సేవలను ప్రచారం చేయవచ్చు. “మీ ఇంటి వద్దకే వచ్చి మీ ముందే మొబైల్ రిపేర్ చేస్తాం” అనే కాన్సెప్ట్‌ను స్పష్టంగా చెప్పాలి. అలాగే మీ ప్రాంతంలో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా సమాచారం షేర్ చేయవచ్చు. మొదట మంచి సేవ అందిస్తే కస్టమర్లు ఇతరులకు చెప్పడం ద్వారా మీకు కొత్త కస్టమర్లు కూడా వస్తారు. ఇలాంటి సేవలు ఇప్పటికే కొన్ని మెట్రో నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్న చిన్న నగరాల్లో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక అవసరమైతే మహిళా టెక్నీషియన్స్‌ని కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. దీనిద్వారా మహిళా కస్టమర్లను ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు.
55
తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం
ఈ వ్యాపారం ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే దుకాణం అవసరం ఉండదు. షాప్ రెంట్, కరెంట్ బిల్లు, ఇంటీరియర్ ఖర్చులు ఉండవు. అందువల్ల పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఒక రోజులో కనీసం ఐదు ఫోన్లు రిపేర్ చేసినా సగటుగా రోజుకు రూ.2500 వరకు లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇలా చూస్తే నెలకు సుమారు రూ.50 వేల వరకు ఆదాయం పొందడం సాధ్యమే. మీ దగ్గర పాత కారు ఉంటే దాన్ని చిన్న మొబైల్ రిపేర్ సెంటర్‌గా కూడా మార్చుకోవచ్చు. వెనుక సీట్లను తీసేసి టేబుల్ ఏర్పాటు చేస్తే అది ఒక చిన్న వర్క్ స్టేషన్‌గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకుని మొబైల్ రిపేర్ సేవలను ప్రారంభిస్తే తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సరైన నైపుణ్యం, కస్టమర్లతో నమ్మకం కలిగించే సేవ ఉంటే ఈ వ్యాపారం మంచి స్థాయికి చేరే అవకాశముంది.