అమెరికా డెఫిసిట్, నేషనల్ డెబ్ట్ అధికంగా ఉన్నప్పుడు, డాలర్ బలహీన పడుతుంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు సేఫ్-హేవెన్ ఆస్తులలో డబ్బు పెట్టడం పెరుగుతుంది. అమెరికా డెబ్ట్ సమస్యల కారణంగా బంగారం డిమాండ్ పెరుగుతూ, భారత మార్కెట్‌లో కూడా తులం ₹2,00,000 వరకు చేరే అంచనాలు బలపడుతున్నాయి.
అంతర్జాతీయ గ్లోబల్ మార్కెట్, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోలు, డీ-డాలరైజేషన్, జియోపాలిటికల్ టెన్షన్‌లు, లిమిటెడ్ సప్లై, కరెన్సీ డివాలివేషన్.. ఇలాంటి అనేక అంశాలు కలిసి తులం బంగారం ధరను ₹2,00,000కు చేరేలా మారుస్తాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, నిజంగానే బంగారం ధరలు రెండు లక్షలు అవుతుందా? లేదా అంతకు మించి పెరుగుతుందా లేదా తగ్గుతుందా? అనేది రాబోయే రోజులే స్పష్టం చేస్తాయి.