Smart TV: రూ. 18 వేల‌కే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఇలాంటి ఛాన్స్ మ‌ళ్లీ రాదు గురూ..

Published : Oct 03, 2025, 03:14 PM IST

Smart TV: అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్‌లో భాగంగా స్మార్ట్ టీవీల‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఇందులో భాగంగా షావోమీ టీవీపై ఏకంగా 50 శాతం త‌గ్గింపు ధ‌ర ల‌భిస్తోంది. ఈ డీల్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
49 శాతం డిస్కౌంట్

షావోమీ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 37,999కాగా ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో 49 శాతం డిస్కౌంట్‌తో రూ. 19,499కి ల‌భిస్తోంది. ఈ టీవీని ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అద‌నంగా రూ. 1500 వ‌ర‌కు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ లెక్కన ఈ స్మార్ట్ టీవీని సుమారు రూ. 18 వేల‌కు సొంతం చేసుకోవ‌చ్చు. ఇంత త‌క్కువ ధ‌ర‌లో 43 ఇంచెస్ టీవీ ల‌భించ‌డం విశేషం. ఇక ఈ టీవీని అమెజాన్ పే క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎమ్ఐతో సొంతం చేసుకోవ‌చ్చు. నెల‌కు రూ. 6500 చొప్పున మూడు నెల‌లు చెల్లించ‌వ‌చ్చు. ఈ టీవీ ఫీచ‌ర్ల‌పై ఓ లుక్కేయండి

25
స్క్రీన్ & డిస్‌ప్లే

ఈ టీవీ 43 అంగుళాల (108 cm) Ultra HD 4K రిజల్యూషన్‌ (3840 x 2160)తో వస్తుంది. HDR10, HLG, Vivid Picture Engine, Reality Flow MEMC టెక్నాలజీ వల్ల క్వాలిటీ కలర్‌లు, స్పష్టమైన పిక్చర్ లభిస్తాయి. బెజెల్-లెస్ డిజైన్ వల్ల ఆధునిక లుక్ ఉంటుంది.

35
కనెక్టివిటీ ఆప్షన్లు

టీవీలో 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, బ్లూటూత్, బిల్ట్-ఇన్ వై-ఫై, ఈథర్నెట్ కనెక్షన్ లభిస్తాయి. గేమింగ్ కాన్సోల్, బ్లూ-రే ప్లేయర్, సెట్ టాప్ బాక్స్ లేదా హార్డ్ డ్రైవ్‌లను సులభంగా కనెక్ట్ చేయవచ్చు.

45
సౌండ్ క్వాలిటీ

24 వాట్స్ అవుట్‌పుట్ స్పీకర్లతో వస్తున్న ఈ టీవీ డాల్బీ ఆడియో, DTS-X, DTS వ‌ర్చువ‌ల్ :X సపోర్ట్ చేస్తుంది. హోమ్ థియేటర్ తరహా ఆడియో అనుభవం లభిస్తుంది.

స్మార్ట్ ఫీచర్లు

ఈ టీవీకి Fire TV బిల్ట్-ఇన్‌గా ఉంటుంది. దీంతో ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్ వంటి ఓటీటీలు ఇన్‌బిల్ట్‌గా ల‌భిస్తాయి. మొత్తం 12,000కి పైగా యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉంది. వాయిస్ రిమోట్‌లో Alexa సపోర్ట్ కూడా ఉంది. DTH సెట్-టాప్ బాక్స్ ఇంటిగ్రేషన్ వల్ల టీవీ చానెల్స్, OTT యాప్‌లను ఒకే స్క్రీన్ నుంచి సులభంగా యాక్సెస్ చేయవచ్చు.

55
వారంటీ & అదనపు సమాచారం

ఈ టీవీకి 1 సంవత్సరం ఫుల్‌ వారంటీ ఉంటుంది. కానీ ఏవైనా ఫిజికల్ డ్యామేజ్ అయితే వారంటీ వ‌ర్తించ‌దు. బ్రాండ్ వారంటీని అమెజాన్ ఇన్వాయిస్‌తో పొందవచ్చు. యూజర్ మాన్యువల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. మొత్తం మీద ఈ టీవీ అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీ, శక్తివంతమైన సౌండ్, స్మార్ట్ ఫీచర్లతో ఇంటికి ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories