తమ స్థాయికి తగ్గట్టు చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఎంపిక చేసుకుని కొనుక్కుంటారు. ఇక్కడ మేము దేశంలోనే బెస్ట్ ఫ్యామిలీ కార్ (Family car) గురించి ఇచ్చాము. దీని ధర కూడా తక్కువే. ఈఎమ్ఐ ఆఫర్లో నెలకు కట్టాల్సిన నగదు కూడా తక్కువే ఉంటుంది.
జిఎస్టి సంస్కరణల వల్ల చిన్నకార్ల ధరలు చాలా వరకు తగ్గాయి. ఇప్పటికే ఎన్నో సంస్థలు తగ్గించిన ధరలను ప్రకటించాయి కూడా. మధ్యతరగతి ప్రజలు ఈఎమ్ఐలు పెట్టి కార్లు కొనేందుకు ఇష్టపడతారు. అలాంటి వారికి ఇది ఉత్తమమైన సమయమని చెప్పవచ్చు. అయితే మీరు మంచి ఫ్యామిలీ కారు వెతుకుతున్నట్టు అయితే ఇక్కడ మేము ఉత్తమమైన కారు గురించి చెప్పాము. ఇది 32 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పైగా ధర కూడా చాలా తగ్గింది. అదే మారుతి సుజుకి స్విఫ్ట్. ఇది విడుదలైనప్పటి నుంచి అందరికీ ఎంతో నచ్చిన కారు. దీని ఇంధన సామర్థ్యం, డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ అన్నీ కూడా దీన్ని ఉత్తమమైనదిగా మార్కెట్లో నిలబెట్టాయి. ఇప్పుడు కొత్త జీఎస్టీ వల్ల ధర కూడా చాలా తగ్గింది. ఇప్పుడు ఈ కారు కొనేందుకు ఉత్తమ సమయమని చెప్పవచ్చు.
24
సుజుకి స్విఫ్ట్ పై ఎంత తగ్గింపు?
జిఎస్టి సవరణల తర్వాత మారుతి సుజుకి తమ కారు ధరలను తగ్గించింది. అలాగే స్విఫ్ట్ మోడల్ పై కూడా తగ్గింపు ధరలను అందించింది. కొత్త పన్ను స్లాబ్ ప్రకారము మారుతి స్విఫ్ట్ కారు ఇప్పుడు 85 వేల రూపాయల వరకు తగ్గి వస్తోంది. అంటే గతంతో పోలిస్తే మీరు 85,000 తక్కువగా చెల్లించడానికి అవకాశం ఉంది. ఈ కారు వేరియంట్ల వారీగా తగ్గింపు ధరలు ఆధారపడి ఉన్నాయి.
34
స్విఫ్ట్ లో వేరియంట్లు
మారుతి సుజుకి స్విఫ్ట్ లో మ్యాన్యువల్ వేరియంట్లు ఉన్నాయి. అన్నిటిపై కూడా 70 వేల నుంచి 72 వేల రూపాయలు తగ్గించారు. స్విఫ్ట్ బేస్ మోడల్ కేవలం 5.79 లక్షల రూపాయలకే వస్తుంది. ఇంతకు ముందు దీని ధర 6.49 లక్షల రూపాయలుగా ఉండేది. మరొక వేరియంటు విఎక్స్ఐ ధర 6.85 లక్షల రూపాయలకు తగ్గింది. పాత ధరల ప్రకారం ఇది 7.57 లక్షల రూపాయలు ఉండేది. అంటే దాదాపు 72 వేల రూపాయలు తగ్గింది. ఈఎంఐ పెట్టుకునే వారికి ఆరు నెలల ఈఎంఐ తగ్గినట్టే.
ఇక ఆటోమేటిక్ మోడల్ కోసం వెతుకుతున్న వారు మారుతి సుజుకి స్విఫ్ట్ ను 7.04 లక్షల రూపాయలకు సొంతం చేసుకోవచ్చు. అంతకు ముందు దీని ధర 7.80 లక్షల రూపాయలు ఉండేది. అంటే దాదాపు 76 వేల రూపాయలు తగ్గింది. ఇక టాప్ ఎండ్ మోడల్ కొత్త ధర 8.65 లక్ష రూపాయలు మాత్రమే ఉంది. ఫ్యామిలీ కోసం కారు కొనేవారికి అతి తక్కువగా వచ్చే బెస్ట్ కారు ఇది.