Gold Price: భారీగా త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌.. తులంపై రూ. 10 వేలు త‌గ్గ‌నుందా.?

Published : Jun 29, 2025, 07:31 AM IST

రూ. ల‌క్ష దాటి ప‌రుగులు పెట్టిన బంగారం ధ‌ర ప్ర‌స్తుతం నేల చూపులు చూస్తోంది. ఇటీవ‌లి కాలంలో బంగారం ధ‌ర‌లో ప్ర‌తీ రోజూ త‌గ్గుదుల క‌నిపిస్తోంది. చాలా రోజుల త‌ర్వాత తులం బంగారం ధ‌ర రూ. 97 వేల మార్క్‌కి చేరింది. 

PREV
17
రూ. 97 వేల మార్క్‌కి చేరిన బంగారం

బంగారం ధ‌ర‌ చాలా రోజుల త‌ర్వాత రూ. 97 వేల మార్క్‌కి దిగొచ్చింది. ప్ర‌స్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 97,420 వద్ద కొన‌సాగుతోంది అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,300 వ‌ద్ద ఉంది. మ‌రి దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఆదివారం బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

27
ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు.

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 97,570గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,450 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 97,420గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,300 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* చెన్నైలో ఆదివారం 24 క్యారెట్ల తులం బంగారం రూ. 97,420 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, 22 క్యారెట్ల గోల్డ ధ‌ర రూ. 89,300 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* బెంగ‌ళూరు విష‌యానికొస్తే ఇక్క‌డ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 97,420గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ ధర రూ. 89,300 వ‌ద్ద కొన‌సాగుతోంది.

37
తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

* హైద‌రాబాద్‌లో కూడా బంగారం ధ‌ర‌లో త‌గ్గుద‌ల క‌నిపించింది. ఇక్కడ ఆదివారం ఉద‌యం 6 గంట‌లకు న‌మోదైన వివ‌రాల ప్ర‌కారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 97,420గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 89,300గా ఉంది.

* విజ‌య‌వాడ‌లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 97,420గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 89,300 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విశాఖ‌ప‌ట్నంలో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 97,420, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 89,300గా ఉంది.

47
వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

బంగారం ధ‌ర‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తుంటే, వెండి ధ‌ర‌లు మాత్రం దూసుకెళ్తున్నాయి. దేశంలో అన్ని న‌గ‌రాల్లో వెండి ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆదివారం ఢిల్లీతో పాటు ముంబై, బెంగ‌ళూరు, కోల్‌క‌తా వంటి న‌గ‌రాల్లో కిలో వెండి ధ‌ర రూ. 1,07,800గా ఉండ‌గా, హైదరాబాద్‌, కేర‌ళ‌, చెన్నై, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో కిలో వెండి ధ‌ర గ‌రిష్టంగా రూ. 1,17,800 వ‌ద్ద కొన‌సాగుతోంది.

57
బంగారం ధ‌ర‌ ఎందుకు త‌గ్గుతోంది.?

ఇటీవల అమెరికా స్టాక్ మార్కెట్ బలంగా పుంజుకోవడంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అటుగా మ‌ళ్లిస్తున్నారు. ఈ పరిణామం వల్ల బంగారంపై పెట్టుబడి ఆసక్తి కొంత తగ్గి, దాని ధరలు క్రమంగా దిగజారుతున్నాయి. ఆర్థిక స్థిరత సంకేతాలు మెరుగవుతుండటంతో, పలు దేశాల్లోని పెట్టుబడిదారులు ఇప్పుడు మదుపు మార్కెట్లవైపు దృష్టి సారిస్తున్నారు.

ఎక్కువ రాబడిని ఆశించే స్టాక్ మార్కెట్‌లో తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఈ విధంగా డిమాండ్ తగ్గడంతో బంగారం ధరలపై ఒత్తిడి స్పష్టమవుతోంది. త్వ‌ర‌లోనే తులం బంగారం ధ‌ర రూ. 90 వేల‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

67
వినియోగదారులకు మంచి అవకాశం

ధరలు తగ్గుతున్న నేపథ్యంలో, పసిడి ఆభరణాలపై ఆసక్తి ఉన్న సాధారణ వినియోగదారులకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది. దీపావళి, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాలకు ముందే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటే, ప్రస్తుత ధరలు మరింత లాభదాయకంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

77
భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉండ‌నున్నాయి.?

బంగారం ధరలు ఇంకా కాస్త మేరకు పడిపోవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు వంటి అంశాలు దీనిపై కీలక ప్రభావం చూపించనున్నాయి. అటు అమెరికా ఫెడ్ రెసర్వ్ వడ్డీ రేట్ల విధానం కూడా బంగారం విలువను ప్రభావితం చేసే అంశాలలో ఒకటి. కాబ‌ట్టి బంగారం ధ‌ర ప‌త‌నం ఇలాగే కొన‌సాగుతుందా.? అంటే చెప్ప‌లేం.

Read more Photos on
click me!

Recommended Stories