Gold Price: క్ర‌మంగా త‌గ్గుతోన్న బంగారం ధ‌ర‌లు.. ప్రస్తుతం తులం గోల్డ్ ఎంతో తెలుసా.?

Published : Jun 27, 2025, 06:56 AM IST

ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోయిన బంగారం ధ‌ర‌ల‌కు కాస్త బ్రేక్ ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. తులం బంగారం ధ‌ర రూ. ల‌క్ష దాటేసి పరుగులు పెట్టిన త‌ర్వాత క్ర‌మంగా మ‌ళ్లీ దిగొస్తోంది. తాజాగా శుక్ర‌వారం కూడా బంగారం ధ‌ర‌లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల క‌నిపించింది. 

PREV
16
బంగారం ధరల్లో క్షీణత

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశంగా చెప్పొచ్చు. ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు జూన్ 25 నుంచి భారీగా ప‌త‌న‌మ‌వుతున్నాయి. చాలా రోజుల త‌ర్వాత తులం బంగారం ధ‌ర రూ. 98 వేల మార్క్‌కి దిగొచ్చింది. అంతర్జాతీయంగా మారిన పరిణామాలు, ఆర్థిక విధానాల్లో వచ్చిన మార్పులే దీనికి కారణమవుతున్నాయి.

26
దేశంలో ప్ర‌ధాన న‌గరాల్లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 99090 గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,840 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 98,940 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,690 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 98,940 గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,690 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* బెంగ‌ళూరు విష‌యానికొస్తే ఇక్క‌డ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ. 98,940 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా, 22 క్యారెట్ల ధ‌ర రూ. 90,690 గా ఉంది.

36
తెలుగు రాష్ట్రాల్లో ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే.?

* హైద‌రాబాద్‌లోనూ బంగారం ధ‌ర‌లో త‌గ్గుదుల క‌నిపించింది. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధ‌ర రూ. 98,940గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,690 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విజ‌య‌వాడ‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధ‌ర రూ. 98,940 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,690 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విశాఖ‌ప‌ట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 98,940 గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 90,690 గా న‌మోదైంది.

46
బంగారం ధ‌ర ఎందుకు త‌గ్గుతోంది.?

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు శాంతిచర్చల దిశగా మలుపు తిప్పిన నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం మొదలైంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పెట్టుబడిదారులు భద్రతాపరమైన పెట్టుబడుల నుంచి వెన‌క్కి త‌గ్గుతున్నారు.

56
అమెరికా ఫెడ్ తటస్థ విధానం దిశగా

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బృందం ద్రవ్య విధానాన్ని సడలించే సూచనలు ఇవ్వకపోవడంతో బంగారం ఆకర్షణ తగ్గింది. తటస్థ ధోరణిని పాటిస్తూ వడ్డీ రేట్ల విషయంలో స్థిరత చూపింది. ఈ ప్రభావంతో డాలర్ బలపడటంతో పసిడి విలువ తగ్గుతోంది.

66
అంతర్జాతీయ మార్కెట్లో భారీ పతనం

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు రెండు శాతానికి పైగా పడిపోయాయి. MCXలో ఔన్స్ బంగారం ధర 3,300 డాలర్ల మార్కు దిగువకు జారిపోయి రెండు వారాల కనిష్ఠ స్థాయికి చేరింది. పెట్టుబడులు మళ్లీ స్టాక్ మార్కెట్లు, బాండ్స్ వంటివైపున‌కు మ‌ళ్లుతున్నాయ‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories