POCO F7: ఇంత త‌క్కువ బ‌డ్జెట్‌లో ఇన్ని ఫీచ‌ర్లు ఏంటి భ‌య్యా.? పోకో నుంచి స్ట‌న్నింగ్ స్మార్ట్‌ఫోన్

Published : Jun 27, 2025, 07:56 AM IST

చైనాకు చెందిన ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీ పోకో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చారు. పోకో ఎఫ్‌7 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. త‌క్కువ బ‌డ్జెట్‌లో మంచి ఫీచ‌ర్ల‌తో కూడిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
భారీ డిస్‌ప్లేతో POCO F7 లాంచ్

పొకో సంస్థ భారత మార్కెట్‌లో POCO F7 స్మార్ట్‌ఫోన్‌ను గురువారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ 6.83 అంగుళాల 1.5K LTPS OLED వంటి భారీ స్క్రీన్‌తో వచ్చింది. దీని బ్రైట్‌నెస్‌ 3200 నిట్స్ వరకు ఉంటుంది. 

స్క్రీన్‌పై 1.5mm మూడు వైపులా బెజెల్స్ ఉండగా, చిన్ భాగంలో 1.9mm ఉంటుంది. డాల్బీ విజన్, 3840Hz PWM డిమ్మింగ్‌ ఫీచర్లతో కళ్లకి హానికరమైన వెలుతురు నుంచి రక్షణ ఉంటుంది.

25
శక్తివంతమైన ప్రాసెసర్

POCO F7 ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్‌ 8s Gen 4 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనిని 4nm ఫాబ్రికేషన్‌తో త‌యారు చేశారు. దీని AnTuTu స్కోర్‌ 2.1 మిలియన్ల వరకు ఉందని కంపెనీ పేర్కొంది. మల్టీటాస్కింగ్, హై ఎండ్ గేమింగ్‌ కోసం రేగ్ ఇంజ‌న్ 4.0 ట్యూనింగ్, 6000mm² డ్యూయల్ IceLoop 3D కూలింగ్‌ టెక్నాలజీ ఉంది. 

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత షావోమీ హైప‌ర్ ఓఎస్‌2పై ర‌న్ అవుతుంది. 4 OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని పొకో హామీ ఇచ్చింది.

35
కెమెరా, డిజైన్, బిల్డ్ క్వాలిటీ

ఫోన్‌ వెనుక భాగంలో 50MP Sony IMX882 మెయిన్ కెమెరా (OIS, EIS సపోర్ట్), 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో డ్యూయ‌ల్ కెమెరా సెట‌ప్‌ను అందించారు. ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక భాగాన్ని గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కవర్ చేస్తుంది. 

CNC + సాండ్‌బ్లాస్టింగ్‌ టెక్నాలజీతో చేసిన మెటల్ ఫ్రేమ్‌ ఉంది. 70 కేజీల వరకు బెండింగ్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. IP66, IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్‌ను అందించారు.

45
మెరుగైన బ్యాట‌రీ, ధ‌ర‌లు

POCO F7 ఫోన్‌ 7550mAh బ్యాటరీతో వచ్చింది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ ను, 22.5W రివర్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. పొకో ప్రకారం 1600 ఛార్జింగ్ సైకిల్స్ తరువాత కూడా బ్యాటరీ ఆరోగ్యం 80% వరకు ఉంటుంది.

POCO F7ని ఫ్రాస్ట్ వైట్, ఫాంటమ్ బ్లాక్, సైబర్ సిల్వర్ క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చార ఇక ధ‌ర విష‌యానికొస్తే 12 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్ ధ‌ర రూ. 31,999గా ఉండ‌గా, 12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధ‌ర రూ. 33,999గా నిర్ణ‌యించారు.

55
ఆఫ‌ర్లు

లాంచింగ్ ఆఫ‌ర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ల‌కు చెందిన కార్డుల‌తో కొనుగోలు చేస్తే రూ. 2000 డిస్కౌంట్ ల‌భిస్తోంది. అలాగే 12 నెలల పాటు నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్ష‌న్‌ను అందిస్తున్నారు. 1 సంవత్సరం అదనపు వారంటీతో పాటు రూ. 10,000 విలువైన స్క్రీన్‌ రిప్లేస్‌మెంట్ ఒక‌సారి ఉచితంగా ఇవ్వ‌నున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories