దేశవ్యాప్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు గరిష్ఠ స్థాయిల్లో కొనసాగుతున్నాయి. స్థానిక పన్నులు, రవాణా వ్యయాల ఆధారంగా తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో ప్రస్తుతం నమోదైన ధరలు గమనిస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర సుమారు రూ.1,56,770 కాగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,700 గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ₹1,17,580 వద్ద ట్రేడ్ అవుతోంది.
అదేవిధంగా విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,770 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర ₹1,43,700గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర ₹1,20,967 గా ఉంది. మరోవైపు, పారిశ్రామిక రంగా నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో రెండు నగరాల్లోనూ కిలో వెండి ధర ఏకంగా ₹2,60,000 మార్కును తాకింది. ఈ ధరలన్నీ బేస్ అంచనా మాత్రమే, వీటిపై 3% GST, జ్యువెలర్స్ మేకింగ్ ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి.
ఫ్యూచర్ సేవింగ్స్ విషయంలో కాగితపు నోట్లపై మాత్రమే ఆధారపడకుండా, గోల్డ్, సిల్వర్ వంటి రియల్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థిక భద్రత సాధించవచ్చని రాబర్ట్ కియోసాకి అనుభవంతో చెప్పారు.