Published : Aug 31, 2026, 03:03 PM ISTUpdated : Aug 31, 2026, 03:20 PM IST
భారతదేశంలోనే అత్యంత తక్కువ ధరకు బంగారం లభించే నగరం ఏది? అక్కడ రేటు ఎందుకంత తక్కువగా ఉంటుంది? బంగారం అత్యధిక ధర ఉండే సిటీ ఏది? ఇందుకు కారణమేంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
మనం రోజూ బంగారం ధర పెరిగిందనో లేక తగ్గిందనో వింటుంటాం… ఈ ధర దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుందని అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు… ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా బంగారం ధర ఉంటుంది. మన హైదరాబాద్ లో ఒకలా, ఆర్థిక రాజధాని ముంబైలో మరోలా ధరలు ఉంటాయి. రవాణా ఖర్చులు, స్థానిక పన్నులు, హ్యాండ్లింగ్ ఛార్జీల వల్ల ఒక్కో నగరంలో బంగారం ధర ఒక్కోలా ఉంటుంది. మరి ఇండియాలో అత్యంత చౌకగా బంగారం దొరికే నగరం ఏదో తెలుసా?
25
త్రిస్సూర్ లో బంగారం ధర ఎందుకంత తక్కువ?
భారతదేశ 'గోల్డ్ క్యాపిటల్' గా కేరళలోని ‘త్రిస్సూర్’ నగరం పేరుగాంచింది. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ త్రిస్సూర్ లో బంగారం ధర తక్కువగా ఉంటుంది… ఇందుకు కొన్ని కీలక ఆర్థిక కారణాలున్నాయి.
మొదటిది రవాణా ఖర్చులు (లాజిస్టిక్స్) తక్కువగా ఉండటం. విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం సముద్ర మార్గంలో కేరళలోని కొచ్చి పోర్ట్‌కు చేరుకుంటుంది. ఈ త్రిస్సూర్ నగరం కొచ్చికి చాలా దగ్గరగా ఉండటంతో రవాణా, నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతాయి. ఈ ప్రయోజనం నేరుగా కస్టమర్లకు అందుతుంది… అందుకే ధర తగ్గుతుంది.
35
త్రిస్సూర్ లో భారీ మార్కెట్, నెట్‌వర్క్
త్రిస్సూర్ బంగారు వ్యాపారానికి ఒక గ్లోబల్ సెంటర్‌గా ఉంది. ఇక్కడ భారీ స్థాయిలో గోల్డ్ ట్రేడింగ్ జరుగుతుంది. పెద్ద హోల్‌సేల్ మార్కెట్ ఉండటంతో వ్యాపారుల మధ్య పోటీ ఎక్కువ. కాబట్టి వ్యాపారులు తక్కువ లాభాలతో (Low margins) ఎక్కువ మొత్తంలో బంగారం అమ్మడానికి ముందుకొస్తారు. ఇది కూడా త్రిస్సూర్ బంగారం ధరలు తక్కువగా ఉండటానికి కారణం.
దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలపై జీఎస్‌టీ ఒకేలా ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాలు విధించే స్థానిక సెస్సులు, హ్యాండ్లింగ్ ఛార్జీలు వేర్వేరుగా ఉంటాయి. అయితే కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బంగారంపై విధించే పన్నులు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి…అందుకే కస్టమర్లకు తక్కువ ధరకే బంగారం లభిస్తోంది.
55
అత్యధిక ధరకు బంగారం లభించే సిటీ ఏది?
మరోవైపు దేశంలోనే అత్యధిక ధరకు బంగారం అమ్ముడయ్యే నగరాల్లో ఢిల్లీ ముందుంది. రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండటం, మెట్రో నగర నిర్వహణ వ్యయాలు, స్థానిక అదనపు పన్నుల కారణంగా డిల్లీలో బంగారం రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త తక్కువగానే ఉంటాయి… హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి తెలుగు నగరాల్లో బంగారం ధరలు తక్కువే.
మీరు పెద్ద మొత్తంలో బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే లేదా పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకుంటే త్రిస్సూర్ అత్యంత అనుకూలమైన, లాభదాయకమైన మార్కెట్ అని నిపుణులు చెబుతున్నారు.