ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ లో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు

Published : Aug 25, 2025, 06:58 PM ISTUpdated : Aug 25, 2025, 07:08 PM IST

Flipkart Jobs : ఫెస్టివల్ సేల్స్ కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ ఉద్యోగాలు సప్లై చైన్, లాజిస్టిక్స్, లాస్ట్-మైల్ డెలివరీ విభాగాల్లో ఉన్నాయి.

PREV
15
పండుగ సీజన్‌కు సిద్ధం.. ఫ్లిప్‌కార్ట్ లో 2.2 లక్షలకు పైగా ఉద్యోగాలు

రాబోయే పండుగ సీజన్ కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2.2 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలను ఇస్తోంది. ఈ ఉద్యోగాలు సప్లై చైన్, లాజిస్టిక్స్, లాస్ట్-మైల్ డెలివరీ నెట్‌వర్క్‌లలో అందుబాటులో ఉంటాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పండగ సీజన్ లో తమ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టామన్నారు.

దీంతో పండుగ సీజన్ డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఉద్యోగాల కల్పనతో పాటు, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలు, సాంకేతికతను విస్తరిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

DID YOU KNOW ?
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఫెస్టివల్ సేల్స్
పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ సంస్థలు అమ్మకాలను పెంచుకోవడం కోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకొస్తాయి. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' పేరుతో ఈ అమ్మకాలను భారీగా పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది మొత్తం పండుగ సీజన్ అమ్మకాలు సుమారు $12 బిలియన్లకు చేరుకుంటాయని అంచనా. ఇది గత సంవత్సరం కంటే 12% ఎక్కువ.
25
కొత్తగా 650 ఫెస్టివ్ హబ్‌లు

పండుగ సీజన్ కోసం తమ లాస్ట్-మైల్ డెలివరీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. దీని కోసం దేశవ్యాప్తంగా ఉన్న టైర్-2, టైర్-3 నగరాల్లో 650 కొత్త డెలివరీ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.

సిలిగురి, కుండ్లి, జాఖర్ వంటి నగరాలతో పాటు అనేక చిన్న పట్టణాల్లో ఈ హబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఈ హబ్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు కూడా వేగంగా డెలివరీ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా పిన్‌కోడ్‌లను కవర్ చేస్తూ డెలివరీ వేగం పెరుగుతుందని సంస్థ తెలిపింది. ఈ నియామకాల్లో 15% మంది కొత్తగా ఉద్యోగంలో చేరేవారే ఉంటారని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

35
మహిళలు, దివ్యాంగులకు మరిన్ని అవకాశాలు

ఈ ఉద్యోగాలు వేర్‌హౌసింగ్, డెలివరీ, టీమ్ లీడ్స్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వంటి విభాగాల్లో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. పికర్స్, ప్యాకర్స్, సార్టర్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ల వంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. మహిళలు, వికలాంగుల (PwD) నియామకాల్లో 10% వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. 

ఈ పండుగ సీజన్‌లో తమ నెట్‌వర్క్‌ను పటిష్టం చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిమాండ్ ప్లానింగ్, సార్టేషన్ కచ్చితత్వం కోసం ఆటోమేషన్, ఇన్వెంటరీ టూల్స్ వంటివి ఉన్నాయని పేర్కొంది.

45
ఉద్యోగ కల్పన, నైపుణ్య అభివృద్ధికి ఫ్లిప్ కార్ట్ చర్యలు

ఈ ఏడాది, తమ సామర్థ్యాలను పండుగ సీజన్‌కు ముందు పెంచుకున్నామని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సీమా నాయర్ తెలిపారు. "మేము సమ్మిళిత వర్క్‌ఫోర్స్, మా సప్లై చైన్ పీపుల్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, సాంకేతికతతో కూడిన మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై దృష్టి సారించామని" తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ తన సప్లై చైన్ ఆపరేషన్స్ అకాడమీ (SCOA) ద్వారా ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిందనీ, 2025 చివరి నాటికి అదనంగా 10,000 మంది అసోసియేట్‌లకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని యోచిస్తోందన్నారు.

55
ఈ-కామర్స్ దిగ్గజాల మధ్య పెరుగుతున్న పోటీ

పండుగ సీజన్‌లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ తీసుకున్న ఈ చర్యల వల్ల అమెజాన్ ఇండియా, రిలయన్స్ జియోమార్ట్ వంటి ఇతర పోటీదారుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొననుంది. ఇప్పటికే అమెజాన్ ఇండియా కూడా పండుగ సీజన్‌ కోసం 1.5 లక్షలకు పైగా తాత్కాలిక ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలు అమెజాన్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, సార్ట్ సెంటర్లు, డెలివరీ నెట్‌వర్క్‌లలో ఉన్నాయి. ఈ నియామకాల్లో మహిళలు, వికలాంగులకు కూడా అవకాశాలు కల్పించినట్లు అమెజాన్ తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories