ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన "నిధి ఆప్కే నికట్ (NAN)" లాంటి ప్రత్యేక కార్యక్రమాల వల్ల దేశవ్యాప్తంగా వివిధ వినియోగదారుల కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య భారీగా తగ్గిందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 1, 2024 నాటికి 4,936 గా ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య, మార్చి 31, 2026 నాటికి 2,646 కి తగ్గిపోయింది.
అలాగే, మొత్తం కోర్టు కేసుల పెండెన్సీ ఏప్రిల్ 1, 2025 నాటికి 31,036 కేసులు ఉండగా, ఏప్రిల్ 1, 2026 నాటికి అది 27,639 కి తగ్గింది. అంటే దాదాపు 3,397 కేసులు తగ్గాయి. ఈపీఎఫ్ఓ చరిత్రలోనే కేసుల సంఖ్య ఇంత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి అని మంత్రి మాండవీయ సంతోషం వ్యక్తం చేశారు.