DMart అనేది సామాన్యుడి కిరాణా షాప్ గా గుర్తింపు పొందింది. అసలే ఇందులో వస్తువులు చాలా తక్కువ ధరకు వస్తాయి.. అలాంటిది వీటిపైనా మరింత డిస్కౌంట్ లభిస్తే ఇంకేం కావాలి. మరి ఇలా ఎవరికి స్పెషల్ ఆఫర్ ఉంటుందో తెలుసా?
DMart : పట్టణీకరణ పేరిట జరుగుతున్న అభివృద్ధి ఏమిటోగాని సామాన్యుడిపై భారం మాత్రం పెరుగుతోంది. మెరుగైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత గ్రామాలను వదిలి పట్టణాల బాట పడుతోంది. అయితే ప్రస్తుతం పోటీ ఎక్కువ కావడంతో నగరాలు, పట్టణాల్లో కూడా ఆదాయం, అవకాశాలు తగ్గుతున్నాయి. అందుకే డిస్కౌంట్, ఆఫర్లు అనే పదాలు వింటేచాలు సామాన్య ప్రజలు ఎగబడిపోతున్నారు. దీన్నే DMart (డీమార్ట్) వంటి సూపర్ మార్కెట్స్ తమ ఆదాయ వనరుగా మార్చుకున్నాయి... వందలు, వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాయి.
డీమార్ట్ కేవలం వినియోగదారులకు సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించడమే కాదు ఉద్యోగులకు కూడా మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు మంచి శాలరీ, పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్), ఆరోగ్యపరంగా భీమా కూడా అందిస్తోంది. చాలా తక్కువ విద్యార్హతలతో ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది... అందుకే డిమార్ట్ లో పనిచేసేందుకు యువతీయువకులు ఆసక్తి చూపిస్తున్నారు. డీమార్ట్ ఉద్యోగులకు మరికొన్ని సదుపాయాలు కల్పిస్తోంది దీన్ని నిర్వహించే అవెన్యూ సూపర్ మార్కెట్ లిమిటెడ్ (ASL)… వాటిగురించి తెలుసుకుందాం.
25
డీమార్ట్ ఉద్యోగులకు స్పెషల్ ఆఫర్లు..
DMart లో పనిచేసే ఉద్యోగులకు కొన్నిసార్లు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. స్టోర్ లోని అహార పదార్థాలు, దుస్తులు, నిత్యావసర వస్తువులపై ప్రత్యేక డిస్కౌంట్ ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లోనే కాదు సాధారణ షాపింగ్ లో కూడా డీమార్ట్ ఉద్యోగులు ప్రత్యేక డిస్కౌంట్స్ పొందుతారు.
కొన్నిసార్లు ఉద్యోగుల కోసమే క్లియరెన్స్ సేల్ నిర్వహిస్తుంటుంది డీమార్ట్ యాజమాన్యం... ఈ సమయంలో చాలా తగ్గింపు ధరతో వస్తువులు లభిస్తాయి. దీనివల్ల ఉద్యోగులకు డబ్బులు ఆదా అవుతాయి... కంపెనీకి కూడా చాలాకాలంగా మిగిలిపోయిన వస్తువులు అమ్ముడుపోతాయి. ఇలా పరస్పరం ప్రయోజనాలను పొందుతూ డీమార్ట్ యాజమాన్యం, ఉద్యోగులు ముందుకు సాగుతున్నారు.
35
డీమార్ట్ ఉద్యోగులకు లభించే మరిన్ని ప్రయోజనాలు...
DMart యాజమాన్యం కేవలం స్వలాభం చూసుకోవడమే కాదు ఎదుగుదలకు కారణమైన ఉద్యోగులకు మంచి సదుపాయాలు కల్పిస్తోంది. చాలాకాలంగా డీమార్ట్ తో కలిసి పనిచేసే ఉద్యోగులు ప్రమోషన్స్ తో పాటు గ్రాట్యూటీ వంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందవచ్చు. వరుసగా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువకాలం పనిచేసే ఉద్యోగులకు గ్రాట్యుటీ లభిస్తుంది… ఈ డబ్బులు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి.
ఇక ఉద్యోగుల పనితీరు ఆధారంగా డీమార్ట్ ప్రత్యేక బోనస్ అందిస్తుంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులకూ వర్తించేలా మెడికల్ ఇన్నూరెన్స్ ఉంటుంది. దీనివల్ల హాస్పిటల్ ఖర్చులు భారీగా తగ్గుతాయి... కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మంచి పనితీరు కనబరుస్తూ అన్ని అర్హతలు కలిగిన ఉద్యోగులకు వెంటవెంటనే ప్రమోషన్లు లభిస్తాయి... తద్వారా ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు.
డీమార్ట్ లో పనిచేసే ఉద్యోగులకు మంచి శాలరీలే ఉన్నాయి... అయితే ఆయా నగరాలు, పట్టణాలను బట్టి ఉద్యోగుల శాలరీల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. సాధారణంగా అయితే సేల్స్ మెన్ వంటి ప్రాథమిక స్థాయి ఉద్యోగులకు నెలకు రూ.10 నుండి 15 వేల వరకు శాలరీలుంటాయి... ఇతర అలవెన్సులు వర్తిస్తాయి. ఇక స్టోర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ వంటి ఉద్యోగాలకు అనుభవం, పనితీరు ఆధారంగా మంచి శాలరీలుంటాయి… వీరికి ఐదంకెల జీతం ఉంటుంది.
55
DMart లో ఉద్యోగాలను ఎలా పొందాలి..?
సాధారణంగా డీమార్ట్ నేరుగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటుంది... డీమార్ట్ స్టోర్స్ అప్పుడప్పుడు జాబ్ వేకెన్సీ ప్రకటనలు కనిపిస్తుంటాయి. కాబట్టి అక్కడే రెజ్యూమ్ సమర్పించి ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇక ఉన్నతస్థాయి ఉద్యోగాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. ఇక LinkedIn వంటి ఆన్లైన్ జాబ్ పోర్టల్స్ లో కూడా ఉద్యోగుల కోసం ప్రయత్నించవచ్చు.
తమ వ్యాపారాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు డీమార్డ్ వేగంగా ముందుకు దూసుకెళుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, వివిధ పట్టణాల్లో 400 పైగా స్టోర్స్ ఉన్నాయి… 500 స్టోర్స్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో డీమార్ట్ లో నిరంతరం ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి... అర్హతలు కలిగిన యువత వెంటనే ఉద్యోగాలను పొందవచ్చు.