Indian Economy: వామ్మో..డబ్బు తయారీకే ఇంత ఖర్చా, RBI షాకింగ్ లెక్కలు.

Published : Jan 10, 2026, 06:06 PM IST

Indian Economy: మన అవసరాల కోసం డబ్బు ఖర్చు పెడతాం. ఏదైనా వస్తువు కొనేటప్పుడు బేరమాడి మరీ కొంటాం. కానీ రోజూ మన చేతుల్లో తిరిగే కాయిన్, కరెన్సీని ఎలా తయారు చేస్తారు, అసలు దాని తయారీకి ఎంత ఖర్చు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ? RBI షాకింగ్ లెక్కలు.. 

PREV
14
మన చేతిలోని కరెన్సీ వెనుక రూ.కోట్ల ఖర్చు

మనీ మన చేతిలోకి రావడం సులభమే కానీ, అది తయారవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో చాలా మందికి తెలియదు. RTI సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చిన వివరాల చూస్తే..నోట్లు, నాణేల తయారీకి RBI భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నాణేలు దాని విలువకంటే ఎక్కువ ఖర్చుతో తయారవుతున్నాయి. అయితే మనీ తయారు చేయడానికి, దాన్ని భద్రపరచడానికి, చెలామణిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటోందని RBI చెబుతోంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వాటి తయారీ ఖర్చు కూడా పెరుగుతోందని తెలిపింది. మనీ తయారీ ఖర్చుపై RBI లెక్కలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు.

24
రూ.1 దాని విలువకంటే ఖర్చే ఎక్కువ

ప్రజలు రోజూ ఉపయోగించే నోట్లు, నాణేలు తయారవ్వడం అంత ఈజీ కాదు. దాని భద్రతా, తయారీ, ప్రింటింగ్ యంత్రాల ఖర్చుతో కలిపి దాని తయారీ ఖర్చుపై ఉంటుంది. ఒక వస్తువుపై రేటు ఎలా నిర్ణయిస్తారో....అలానే డబ్బు తయారీపైనా ధర ఉంటుంది.

RBI లెక్కలు చూసుకుంటే 10 రూపాయల నోటు తయారీకి సుమారు 96 పైసలు ఖర్చవుతోంది. రూ.50 నోటు తయారీకి రూ.1.13 ఖర్చు, రూ.100నోటు తయారీకి 11.77 ఖర్చు. 500 రూపాయల నోటు తయారీ ఖర్చు దాదాపు రూ.2.29 వరకు ఉంటుంది. నాణేల తయారీ చూసుకుంటే నోట్లతో పోలిస్తే నాణేల తయారీ ఖర్చే ఎక్కువ. రూపాయి కాయిన్ తయారీకి సుమారు రూ.1.11 ఖర్చవుతోంది. అంటే దాని మార్కెట్ విలువ కంటే ఎక్కువే. రూ.5 కాయిన్ ఖర్చు రూ.3.69. రూ.10 నాణెం తయారీ ఖర్చు దాదాపు రూ.5.54 వరకు ఉంది.

34
ఎక్కువ ఖర్చు అయినా లాభమే ఎందుకు?

అయితే నాణేల తయారీకి ఎందుకింత ఖర్చు అనే ప్రశ్న సహజంగానే మనలో మెదులుతుంది. దానికి కారణం దీర్ఘకాలంలో వినియోగంలో ఉంటాయి. నోట్లు కొన్ని సంవత్సరాల్లోనే చిరిగిపోతాయి, పాడవుతాయి. వాటిని మళ్లీ ముద్రించాల్సి వస్తుంది. కానీ లోహంతో తయారయ్యే నాణేలు మాత్రం ఒకసారి తయారైతే 50 నుంచి 100 ఏళ్ల వరకు ఉంటాయి. వాటికి ఎలాంటి డ్యామేజీ ఉండదు. అంటే, మొదట్లో తయారీ ఖర్చు ఎక్కువగా కనిపించినా, దీర్ఘకాలంలో నాణేలు ప్రభుత్వానికి లాభదాయకమే. మళ్లీ మళ్లీ ముద్రించాల్సిన అవసరం ఉండదు. దాని వల్ల ఖర్చు తగ్గుతుంది.

44
నోట్ల తయారీలో ఉండేది కాగితం కాదు..

అయితే ఇంకో ఆసక్తికరమైన విషమేమిటంటే నోట్ల తయారీకి కాగితాన్ని వాడుతారు అని అంతా అనుకుంటారు. కానీ కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా....నోటు తయారీకి పత్తిని వాడుతుందట. పత్తితో నోటు తయారు చేస్తారు. మన దేశంలోనే కాకుండా చాలా దేశాల్లోనూ నోట్ల తయారీకి పత్తినే ఉపయోగిస్తున్నారు. పత్తి, నార కలిపి కరెన్సీని ప్రింట్ చేస్తారు.

మొత్తానికి, మన చేతిలో తిరిగే ప్రతి నోటు, ప్రతి నాణెం వెనుక భారీ ఖర్చు, శ్రమ, టెక్నాలజీ దాగి ఉంది. డబ్బును నిర్లక్ష్యంగా చింపేయకుండా, విలువ తెలుసుకుని వాడాల్సిన అవసరాన్ని ఈ RBI లెక్కలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories