Starlink : ఎలన్ మస్క్ స్టార్‌లింక్ భారత్‌లో స్టార్ట్ : ప్లాన్‌లు, స్పీడ్, సైన్‌అప్.. ఫుల్ డిటెయిల్స్ ఇవే

Published : Dec 08, 2025, 05:52 PM IST

Starlink India Plans : భారత్‌లో ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులు అందించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే నెలవారీ ధరలు, హార్డ్‌వేర్ ఖర్చులు, స్పీడ్, కనెక్టివిటీ, సైన్‌అప్ వివరాలు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఇండియాలోకి స్టార్‌లింక్ ఎంట్రీ.. భారత యూజర్ల భారీ అంచనాలు

ఉపగ్రహ ఆధారిత హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే ఎలన్ మస్క్‌ కంపెనీ స్టార్‌లింక్, భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ నుండి ముఖ్య అనుమతులు పొందింది. ఈ సంస్థ, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా గ్రామాలు, కొండ ప్రాంతాలు, అడవులు వంటి నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో స్టార్‌లింక్ పెద్ద మార్పు తీసుకురావొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

25
స్టార్‌లింక్ నెలవారీ ప్లాన్ ధరలు, హార్డ్‌వేర్ ఖర్చులు వెల్లడి

స్టార్‌లింక్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర ₹8,600 గా ఉంది. హార్డ్‌వేర్ కిట్ (డిష్, రౌటర్, కేబుల్స్) కోసం ₹34,000 ఒక్కసారి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్యాకేజీలో యూజర్లకు అన్‌లిమిటెడ్ డేటా, 30 రోజుల ఫ్రీ ట్రయల్, హై స్టెబిలిటీతో కూడిన కనెక్టివిటీ అందించనున్నట్లు స్టార్‌లింక్ వెల్లడించింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ 99.9% అప్‌టైమ్ ఇవ్వగలమని స్టార్‌లింక్ హామీ ఇస్తోంది. అయితే, బిజినెస్ సబ్‌స్క్రిప్షన్ ధరలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

35
కనెక్టివిటీ, స్పీడ్.. స్టార్‌లింక్ ఎలా పనిచేస్తుంది?

స్టార్‌లింక్ ఇంటర్నెట్‌కు ప్రధాన బలం లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలు. ఇవి భూమికి కేవలం 550 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో, లేటెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ అంచనా వేగం 25 Mbps నుంచి 225 Mbps. అప్‌లోడ్ వేగం 40 Mbps వరకు ఉంటుందని అంచనా. ప్రీమియం ప్యాకేజీలలో 500 Mbps వరకు అందే అవకాశం ఉంది.

స్టార్‌లింక్ ఇప్పటికే హైదరాబాద్, ముంబై, లక్నో, నోయిడా, కోల్‌కతా, చండీగఢ్ వంటి కీలక నగరాల్లో గేట్‌వే ఎర్త్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇవి ఉపగ్రహాలు, భూమిపై ఉన్న రిసీవర్లు మధ్య కనెక్టివిటీని నిర్వహించే రిలే స్టేషన్లుగా పనిచేస్తాయి.

45
స్టార్‌లింక్ లో భారతీయులు సైన్ అప్ చేయడం ఎలా?

స్టార్‌లింక్ సర్వీసులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నమోదు చేయడానికి ప్రక్రియ చాలాసులువు. దాని కోసం..

1. అధికారిక వెబ్‌సైట్ starlink.com లోకి వెళ్లాలి

2. Get Started పై క్లిక్ చేయాలి

3. మీ లొకేషన్ ఎంటర్ చేయాలి

4. అందుబాటులో ఉన్న ప్లాన్ ఎంపిక చేసి, చెల్లింపు చేయాలి

అయితే, స్టార్‌లింక్ సేవలు భారత్ లోని అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం అందుబాటులో లేదు. దశలవారీగా యాక్సెస్‌ను విస్తరించనున్నట్టు తెలిపింది.

55
స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఎవరికీ బెస్ట్ అవుతుంది?

స్టార్‌లింక్ ప్రధానంగా సిగ్నల్ లేని అటవి ప్రాంతాలు, కొండలు, మారుమూల గ్రామాలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఫైబర్ లేని ప్రదేశాల్లో వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగులు, విద్యార్థుల కోసం ఆన్‌లైన్ క్లాసులు, రైతులు, అటవీ విభాగాలు వంటి నెట్‌వర్క్ లేనివారికి డిజిటల్ యాక్సెస్ అందిస్తుంది. నగరాల్లో టెలికాం టవర్లు, ఫైబర్ ఇప్పటికే బలంగా ఉండడం వల్ల, స్టార్‌లింక్ ప్రధానంగా గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ లక్ష్యంగా కొనసాగుతుంది.

స్టార్‌లింక్ భారతదేశంలో ఇంటర్నెట్ రంగానికి ఒక గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశముంది. ధరలు కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో ఇది కీలక అవకాశాలు అందిస్తుంది. వచ్చే నెలల్లో కమర్షియల్ సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశముంది. పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, అలాగే, భారత మార్కెట్ పోటీ క్రమంలో ధరలు తగ్గించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories