Gold rate: 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుంది?

Published : Dec 08, 2025, 02:36 PM IST

Gold rate: బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. 2026లో ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆర్ధిక నిపుణులు ప్రకారం వచ్చే ఏడాది ఎంత శాతం బంగారం రేటు పెరుగుతుందో అంచనా వేశారు. 

PREV
15
2026లో బంగారం ధరలు

ప్రపంచ బంగారపు మార్కెట్ ను నిత్యం నిశితంగా గమనిస్తుంది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. ఈ సంస్థ తాజాగా ఇచ్చిన రిపోర్టు ప్రకారం 2026లో బంగారం ధరలు 15 శాతం నుంచి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉండటం, దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అమెరికా-చైనా ఆర్థిక పోటీ పెరుగుతుండటం వంటి కారణాల వల్ల బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఎంతోమంది బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ గా భావిస్తున్నారు. 2025లోనే బంగారం ధరలు భారీగా పెరిగి రికార్డులు సృష్టించాయి. ఇదే ధోరణి కొనసాగితే 2026లో కూడా బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశముందని రిపోర్టు చెబుతోంది.

25
బంగారంలోనే పెట్టుబడులు

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు చెప్పిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న అనిశ్చితి దీనికి ప్రధాన కారణం. పెద్ద దేశాలు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉండటంతో, పెట్టుబడిదారులు తమ డబ్బును సురక్షితమైన ఆస్తుల్లో పెట్టాలని చూస్తున్నారు. అందులో బగారం ముందుంటుంది. మరో ముఖ్య కారణం బంగారంపై దేశాల కేంద్రీయ బ్యాంకుల విపరీతంగా కొంటున్నాయి. చాలా దేశాలు తమ బంగారపు నిల్వలను పెంచుకుంటున్నాయి. దీన్ని చూసి సాధారణ పెట్టుబడిదారులు కూడా బంగారంపై మరింత నమ్మకం పెంచుకుంటున్నారు. అదనంగా, ఈటీఎఫ్‌ల ద్వారా బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో మార్కెట్‌లో డిమాండ్ ఇంకా పెరుగుతోంది.

35
బంగారమే ఎందుకు కొంటున్నారు?

గత ఏడాది బంగారం కొనుగోళ్లలో చాలా భాగం ఈటీఎఫ్ పెట్టుబడిదారులదే. బంగారం ధర పెరుగుతున్న సమయంలో పెట్టుబడిదారులు ఎక్కువగా ఈటీఎఫ్‌ల ద్వారా బంగారం కొనుగోలు చేయడం ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. సాంప్రదాయంగా మనం బంగారం అంటే ఆభరణాలు మాత్రమే అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు బంగారం పెట్టుబడి సాధనంగా మారిపోయింది. స్టాక్ మార్కెట్ పడిపోతే, డాలర్ బలహీన పడితే లేదా ప్రపంచంలో యుద్ధ పరిస్థితులు వచ్చినా బంగారం విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది బంగారంలో కొంత శాతం పెట్టుబడి పెట్టడం ఇష్టపడుతున్నారు.

45
డాలర్ బలంగా మారితే

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతున్న ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలపడినా, వడ్డీ రేట్లు పెరిగినా లేదా అమెరికా డాలర్ బలంగా మారినా... బంగారం ధరలు ఢమాల్ అని పడిపోవచ్చు. దాదాపు 5 శాతం నుంచి 20 శాతం వరకు పడిపోయే అవకాశం కూడా ఉందట. అంటే బంగారం ధరలు విపరీతంగా పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను, వడ్డీ రేట్లను, అంతర్జాతీయ వార్తలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేసారి మొత్తం డబ్బును బంగారంలో పెట్టడం మంచిది కాదు. కొంతశాతం మాత్రమే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయమని చెబుతున్నారు.

55
ముఖ్య సూచనలు

భారతదేశంలో బంగారంపై విపరీతమైన ప్రేమ ఎక్కువ. పెళ్లిళ్లు, పండుగలు... ఏ సందర్భమైనా బంగారం కొనక తప్పదు. ఇప్పుడు పెట్టుబడిపరంగా కూడా బంగారం ప్రాధాన్యం పెరుగుతోంది. రాబోయే సంవత్సరాల్లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నా, రిస్క్ కూడా ఉండటంతో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. బంగారం వస్తువులు కొనే కన్నా ఈటీఎఫ్, గోల్డ్ బాండ్లు వంటి ఆప్షన్లు ఎంచుకుంటే మంచిది. మార్కెట్ ఎలా ఉన్నా, బంగారం సాధారణంగా దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories