Credit card: దేశంలో క్రెడిట్ కార్డు వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. అయితే త్వరలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారీ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై సమాచారం తప్పనిసరి
కొత్త నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించిన క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లిస్తే ఆ వివరాలు ఆదాయపన్ను శాఖకు చేరుతాయి. యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా చెక్ ద్వారా చెల్లించినా ఈ సమాచారం నమోదు అవుతుంది. అలాగే రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగదుగా చెల్లిస్తే కూడా అది ఆదాయపన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పెద్ద లావాదేవీలపై పర్యవేక్షణ పెరుగుతుంది.
25
అడ్రస్ ప్రూఫ్‌గా క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్
పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. అయితే స్టేట్‌మెంట్ మూడు నెలల కంటే పాతది కాకూడదు. మూడునెలల కంటే పాత స్టేట్‌మెంట్‌ను చెల్లుబాటు అయ్యే పత్రంగా పరిగణించరు. కాబట్టి పాన్ దరఖాస్తు చేసే వారు తాజా స్టేట్‌మెంట్ ఇవ్వాలి.
35
క్రెడిట్ కార్డ్‌తో ట్యాక్స్ చెల్లింపులు
కొత్త నిబంధనల ప్రకారం ఆదాయపన్ను చెల్లించేందుకు క్రెడిట్ కార్డ్‌ను అధికారిక చెల్లింపు విధానంగా అనుమతించనున్నారు. క్రెడిట్ కార్డ్‌తో పాటు డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ట్యాక్స్ చెల్లించవచ్చు. దీంతో పన్ను చెల్లింపు ప్రక్రియ మరింత సులభం అవుతుంది. డిజిటల్ చెల్లింపులు పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది.
క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో పాన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి చేయనున్నారు. పాన్ లేకుండా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేయలేవు. ఈ నిబంధన వల్ల లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ట్యాక్స్ వ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది.
55
వినియోగదారులపై ప్రభావం
ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో క్రెడిట్ కార్డ్ వినియోగం చేసే వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భారీ బిల్లులు చెల్లించే వారు తమ ఆదాయం, ఖర్చుల వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే ఈ మార్పులు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే కాకుండా పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే దిశగా తీసుకున్న చర్యలుగా భావిస్తున్నారు.