Post office: ఏం చేయ‌కుండానే 5 ఏళ్ల‌లో రూ. 4 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. ప్ర‌భుత్వ గ్యారెంటీతో

Published : Feb 26, 2026, 05:26 PM IST

Post office: రిటైర్ అయినవారికి భద్రమైన పెట్టుబడి అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి పోస్టాఫీస్ అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెడితే స్థిరమైన వడ్డీతో పాటు భద్రత కూడా ఉంటుంది

PREV
15
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏమిటి?

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పొదుపు పథకం ఇది. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బుకు స్థిరమైన వడ్డీ లభిస్తుంది.

* ప్రస్తుత వడ్డీ రేటు: సంవత్సరానికి సుమారు 8.2%గా ఉంది.

* డిపాజిట్ పూర్తిగా సురక్షితం

* కనీస పెట్టుబడి: రూ. 1,000

* గరిష్ట పెట్టుబడి: రూ. 30 లక్షల వ‌ర‌కు పెట్టొచ్చు.

ఈ పథకం రిస్క్ లేకుండా ఆదాయం పొందాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

25
రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?

ఈ స్కీమ్‌లో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే మంచి స్థిర వడ్డీ వస్తుంది. పెట్టుబడి మొత్తం రూ. 10,00,000 పెట్టార‌ని అనుకుంటే వడ్డీ రేటు 8.2%గా ఉంది. ఈ లెక్క‌న సంవ‌త్స‌రానికి వ‌డ్డీ సుమారు రూ. 82,000 పొందొచ్చు. అంటే 5 ఏళ్ల‌కు వ‌డ్డీతోనే ఏకంగా రూ. 4,10,000 పొందుతారు. మెచ్యూరిటీ సమయంలో అస‌లు, వ‌డ్డీతో క‌లిపి మొత్తం రూ. 14,10,000 పొందొచ్చు. కాగా మెచ్యూరిటీ కంటే ముందు ప్రతి మూడు నెలలకు ఒక‌సారి కూడా వ‌డ్డీ తీసుకోవ‌చ్చు. ఇలా తీసుకుంటే సుమారు రూ. 20,500 వస్తుంది.

35
మెచ్యూరిటీ కాలం, వడ్డీ చెల్లింపు

ఈ పథకంలో మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత డబ్బు తీసుకోవచ్చు. మరో 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. వడ్డీ ప్రతి మూడు నెలలకు చెల్లిస్తారు. రిటైర్ అయిన వారికి ఇది రెగ్యులర్ ఆదాయం లాంటి ప్రయోజనం ఇస్తుంది.

45
ఖాతా ఎవరు ఓపెన్ చేయొచ్చు.?

ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కొన్ని అర్హతలు ఉంటాయి.

* 60 సంవత్సరాలు నిండిన వారు.

* 55–60 సంవత్సరాల మధ్య రిటైర్ అయిన ఉద్యోగులు

* 50 సంవత్సరాలు పూర్తి చేసిన రక్షణ సేవల నుంచి రిటైర్ అయిన వారు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

55
ఈ పథకం ప్రయోజనాలు

ఈ పోస్టాఫీస్ పథకం అనేక ప్రయోజనాలు అందిస్తుంది. వాటిలో ప్ర‌ధాన‌మైవ‌ని ఇవే.

* ప్రభుత్వ భరోసా ఉంటుంది

* స్థిరమైన వడ్డీ లభిస్తుంది

* త్రైమాసిక ఆదాయం వస్తుంది

* దీర్ఘకాలిక పెట్టుబడికి అనుకూలం

* నామినీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. పూర్తి వివ‌రాల కోసం మీ స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌ను సంద‌ర్శించండి.

Read more Photos on
click me!

Recommended Stories