Top 5 Street Businesses : మంచి స్థాయిలో ఉన్న సాప్ట్ వేర్ ఇంజనీర్లు, ఐఎఎస్, ఐపిఎస్ శాలరీల స్థాయిలో సంపాదించే వీధి వ్యాపారులు ఉన్నారు. ఇలా మంచి ఆదాయాన్ని ఇచ్చే స్ట్రీట్ బిజినెస్ లు ఏవో తెలుసా..?
Business Ideas : ఈ రోజుల్లో పెద్దపెద్ద చదువులు, డిగ్రీలు అవసరం లేకుండానే చాలామంది నెలనెలా లక్షలు సంపాదిస్తున్నారు. చేసే పనిలో నైపుణ్యం, కష్టపడే అలవాటు ఉంటే చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ అద్భుతాలు సృష్టించవచ్చు... ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. ఇలా కొందరు సామాన్యులు వీధుల్లో వ్యాపారాలు చేస్తూనే లక్షలు సంపాదిస్తున్నారు... వీరి ఆదాయం ఐఎఎస్, ఐపిఎస్ లనే ఆశ్చర్యపర్చేలా ఉంటుంది. ఇలా తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు కలిగిన వ్యాపారాలేవో ఇక్కడ తెలుసుకుందాం.
26
పానీపూరీ వ్యాపారం
రోడ్డుపక్కన పానీపూరీ అమ్ముకునే వాళ్లు నెలకు రూ.50000-100000 వరకు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో కొందరు పానీపూరి బండ్లవాళ్లు ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇక కోఠీలోని గోకుల్ చాట్ వంటి షాప్ ల ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శుచిగా, రుచిగా పానీపూరీ, చాట్ అందించగలిగితే వ్యాపారం సక్సెస్ కావడం ఖాయం.. నెలనెలా లక్షల ఆదాయం ఖాయం.
36
టీ షాప్
రోడ్డుపక్కన చిన్నచిన్న బండ్లు పెట్టుకుని టీ షాప్ నడిపేవాళ్ళు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో టీ తాగుతుంటారు... రుచిగా టీ అందించగలిగితే రెగ్యులర్ కస్టమర్లు పెరుగుతారు. ఇలా వ్యాపారం క్లిక్ అయ్యిందో నెలకు 1 నుండి 1.5 రూపాయల ఆదాయం ఖాయం. టీ షాప్ నడుపుతూ లక్షలు సంపాదించేవారు చాలామందే ఉన్నారు.
చల్లని టూరిస్ట్ ప్రాంతాల్లో మ్యాగీ అమ్ముతూ లక్షలు సంపాధించేవారు చాలామందే ఉన్నారు. టూరిస్ట్ ఏరియాల్లో నిత్యం రద్దీ ఉంటుంది… కాబట్టి అక్కడ వేడివేడి మ్యాగీ అమ్ముతూ నెలకు రూ.2 -రూ.6 లక్షల సంపాదించే వ్యాపారులు ఉన్నారు. కేవలం రుచి బాగుంటే చాలు... మార్కెటింగ్ అవసరమే లేదు.
బట్టలు ఐరన్ చేసేవారు లేదా టాయిలెట్ క్లీన్ చేసేవారికి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఐటీ ఉద్యోగులు లేదా బిజీగా ఉండే ఫ్యామిలీస్ తమ పనుల కోసం పూర్తిగా వీరిపైనే ఆధారపడుతున్నారు. ధనవంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది మంచి వ్యాపారం.
కొన్న సర్వీస్ యాప్స్ ద్వారా పని చేసేవారికి కూడా నెలకు లక్ష రూపాయల వరకు సంపాదన రావడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇలా కొందరు డెడికేషన్, ఇన్నోవేషన్ తో చిన్నచిన్న పనులు చేస్తూనే ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
66
స్ట్రీట్ ఫుడ్...
రోడ్డు పక్కన తోపుడుబండ్లపై జొన్న, గోదుమ రొట్టెలు కాల్చి అమ్మెవారు నెలకు 50-70 వేల ఆదాయం పొందుతున్నారు. ఇక ఇంటివద్ద ఇడ్లీ, దోసెలు రెడీ చేసి సైకిళ్లపై పెట్టుకుని అమ్మేవారు నెలకు రూ.30 నుండ రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. చిరుతిళ్లు అమ్మేవారు కూడా బాగానే సంపాదిస్తారు.