Retirement: రిటైర్మెంట్ కోసం ఎంత డబ్బు ఉంటే ప్రశాంతంగా జీవితం గడపవచ్చు? ముఖ్యంగా నగరాల్లో జీవించే వారికి ఎంత డబ్బు అవసరం పడుతుంది? ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల కారణంగా రిటైర్మెంట్ తరువాత ప్రతి వ్యక్తికి ఎంత డబ్బు ఖాతాలో ఉండాలో తెలుసుకోండి.
అరవై ఏళ్ల వయసుకు ఎవరైనా చేస్తున్న ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అవ్వాల్సిందే. ఆ సమయానికి తమకంటూ కొంత డబ్బును పక్కన పెట్టుకోవాలి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతారు. పెరుగుతున్న ధరలు కారణంగా ఒక వ్యక్తి తనకు, తన కుటుంబానికి రిటైర్మెంట్ ఫండ్ ఎంత అవసరమో తెలుసుకోండి. మనం సాధారణంగా 5 నుంచి 6 శాతం అనుకునే ద్రవ్యోల్బణం, నగరాల్లో 8 నుంచి 10 శాతం వరకు ఉంటోంది. వైద్య ఖర్చులు ఏటా 12 శఆతం వరకు పెరుగుతున్నాయి. దీనివల్ల, ఈ రోజు నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేసే వ్యక్తి 20 ఏళ్ల తర్వాత అదే జీవనశైలిని కొనసాగించాలంటే నెలకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఏడాదికి ఖర్చు రూ.1 కోటి దాటిపోతుందన్నమాట.
24
రిటైర్మెంట్ జీవిత ఖర్చులు
మనుషుల సగటు ఆయుర్దాయం కూడా పెరుగుతోంది. గతంలో 70 ఏళ్ల వరకు జీవించిన వారు, ఇప్పుడు 85-90 ఏళ్ల వరకు బతుకుతున్నారు. దీనివల్ల, రిటైర్మెంట్ తర్వాత కనీసం 25 నుంచి 30 ఏళ్ల పాటు ఆదాయం లేకుండానే జీవనం సాగించడానికి అవసరమైన డబ్బును ముందుగానే సమకూర్చుకోవాలి. ఇదే రిటైర్మెంట్ ఫండ్.
34
పెట్టుబడి పథకం
రూ.40 కోట్లు అనేది అందరికీ అవసరమైన మొత్తం కాదు. ఇది ఎక్కువగా ముంబై, ఢిల్లీ వంటి అధిక జీవన వ్యయం ఉన్న నగరాలకు వర్తిస్తుంది. చిన్న పట్టణాలు లేదా గ్రామాల్లో నివసించే వారికి రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటే చాలు, ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి, వ్యక్తిగత జీవనశైలి, అవసరాలను బట్టి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.
చివరగా, రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ముఖ్యమైనది ఎంత డబ్బు అన్నది కాదు, ఎప్పుడు మొదలుపెట్టామన్నదే. చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టి, కాంపౌండింగ్ వడ్డీ ప్రయోజనాన్ని పొందితే పెద్ద లక్ష్యాలను కూడా సులభంగా చేరుకోవచ్చు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన పొదుపు, తెలివైన పెట్టుబడి ఉంటే, రిటైర్మెంట్ జీవితం కచ్చితంగా సాఫీగా సాగిపోతుంది.