పచ్చళ్ల వ్యాపారం చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే సుమారు రూ. 10,000 నుంచి రూ. 20,000 వరకు పెట్టుబడి సరిపోతుంది. ఈ పెట్టుబడిలో ప్రధానంగా ఉండే ఖర్చుల విషయానికొస్తే.. మామిడికాయలు లేదా ఇతర కూరగాయలు, నూనె, మసాలాలు, జార్లు, కంటైనర్లు, ప్యాకేజింగ్ మెటీరియల్, లేబుల్స్, బ్రాండింగ్ వంటివి కావాల్సి ఉంటుంది. మొదట చిన్న పరిమాణంలో తయారు చేసి.. అమ్మకం పెరిగే కొద్దీ పెట్టుబడిని పెంచడం మంచిది.