ముడి గింజల కొనుగోలు ధర: కేజీ రూ.5–10 అవుతుంది. తోలు తీసిన గింజ కిలోకు రూ. 20 పైనే పలుకుతోంది. టన్నుకు చూసుకుంటే రూ.20,000–25,000 అవుతుంది. పౌడర్ రూపంలో కేజీ రూ.300–400 వరకు పలుకుతోంది. సరైన నెట్‌వర్క్, నిల్వ సదుపాయాలు ఉంటే మంచి మార్జిన్ సాధ్యమే.
ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
దశ 1: ముడి సరుకు సోర్సింగ్
స్థానిక చింతపండు వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవాలి. అటవీ ప్రాంతాల దగ్గర సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
దశ 2: ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు
బాయిలర్, తొక్క తీసే మెషీన్, గ్రైండింగ్ యూనిట్ అవసరం. చిన్న స్థాయిలో ప్రారంభిస్తే రూ.10–25 లక్షల మధ్య పెట్టుబడి అవసరం కావచ్చు.
దశ 3: లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు
MSME రిజిస్ట్రేషన్, ఫ్యాక్టరీ లైసెన్స్, కాలుష్య నియంత్రణ అనుమతులు తీసుకోవాలి.
దశ 4: మార్కెటింగ్
దేశీయ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. ఎగుమతులకు ఎగుమతి కోడ్ (IEC) అవసరం. ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా కూడా అమ్మకాలు సాధ్యమే.