Cheapest Apple Laptops: ఆపిల్ ల్యాప్‌టాప్‌లు రూ.40,000 కంటే తక్కువ ధరకే, వీటిని చవకగా ఎక్కడ కొనాలంటే..

Published : Apr 08, 2026, 08:50 AM IST

Cheapest Apple Laptops: ఆపిల్ కొత్తగా విడుదల చేసిన మ్యాక్‌బుక్ నియోపై భారీ తగ్గింపును అందిస్తోంది. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో రూ. 40,000 లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం.

PREV
15
కేవలం రూ. 40 వేలకే ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్.. విద్యార్థులకు పండగే !

ప్రస్తుత కాలంలో ల్యాప్‌టాప్ అనేది విలాసం కాదు, అవసరంగా మారింది. ముఖ్యంగా విద్యార్థులకు, ఆఫీసు పనుల కోసం ఆపిల్ వంటి ప్రీమియం బ్రాండ్ ల్యాప్‌టాప్‌ను తీసుకోవాలని కలలు కంటారు. కానీ దాని ధర వింటేనే సామాన్యులకు షాక్ తగిలినట్టుగానే ఉంటుంది. అయితే, ఈ పరిస్థితిని మార్చేందుకు టెక్ దిగ్గజం ఆపిల్ తన వ్యూహాన్ని మార్చుకుంది. విద్యార్థులను, బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని సరికొత్త మ్యాక్‌బుక్ నియో (MacBook Neo) ను మార్కెట్లోకి తెచ్చింది. కేవలం ధర మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా ఇది అద్భుతంగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్ల ద్వారా దీనిని రూ. 40,000 కంటే తక్కువ ధరకే లభిస్తోంది.

25
ఆపిల్ మ్యాక్‌బుక్ నియో ధర తగ్గింపు లెక్కలు ఇదే..

మ్యాక్‌బుక్ నియో అసలు ధర రూ. 69,900. అయితే, ఇప్పుడు ఇది ఏకంగా 40 వేల లోపు లభిస్తోంది. సాధారణంగా ఆపిల్ ఉత్పత్తులపై ఇంత భారీ తగ్గింపు ఊహించలేము. కానీ క్రోమా నిర్వహిస్తున్న ఎవ్రీథింగ్ ఆపిల్సేల్ లో ఈ భారీ తగ్గింపు అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటిగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ ఐడి కార్డులను ఉపయోగించి ఎడ్యుకేషన్ డిస్కౌంట్ పొందితే ధర రూ. 62,910కి తగ్గుతుంది.

ఇక అసలైన మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. మీ వద్ద పాత ల్యాప్‌టాప్ ఉంటే, దాని కండిషన్‌ను బట్టి సుమారు రూ. 12,500 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ లభిస్తుంది. దీనికి అదనంగా క్రోమా రూ. 7,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది. చివరగా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 4,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లన్నీ కలిపితే మ్యాక్‌బుక్ నియో ధర సుమారు రూ. 39,410కి చేరుకుంటుంది.

35
ఆపిల్ మ్యాక్‌బుక్ నియో సూపర్ డిజైన్

తక్కువ ధరలో వస్తోంది కదా అని ఫీచర్లలో ఆపిల్ ఎక్కడా రాజీ పడలేదు. మ్యాక్‌బుక్ నియోలో 13-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను అమర్చారు. ఇది 500 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది, దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. పదునైన విజువల్స్, సహజమైన రంగులు దీని ప్రత్యేకత. ముఖ్యంగా సినిమా ప్రియులకు, గ్రాఫిక్ డిజైనింగ్ ప్రారంభించే వారికి ఇది ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.

45
ఆపిల్ మ్యాక్‌బుక్ నియో లో ఏ18 ప్రో చిప్‌సెట్

ఈ ల్యాప్‌టాప్ పనితీరు విషయానికి వస్తే, ఇందులో ఆపిల్ తన పవర్ ఫుల్ A18 ప్రో చిప్‌సెట్‌ను వాడారు. సాధారణంగా ఐఫోన్లలో కనిపించే ఈ చిప్, మ్యాక్‌బుక్‌లో మల్టీ టాస్కింగ్‌ను ఈజీ చేస్తుంది. మీరు ఒకేసారి పదుల సంఖ్యలో బ్రౌజర్ ట్యాబ్‌లు వాడినా, హై-డెఫినిషన్ వీడియోలు చూసినా ఎక్కడా హ్యాంగ్ అవ్వదు. ఇందులో ఫ్యాన్ ఉండదు, కాబట్టి మీరు నిశ్శబ్దంగా మీ పనులు చేసుకోవచ్చు. 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనులను మరింత ఫాస్ట్ గా చేస్తుంది.

55
ఆపిల్ మ్యాక్‌బుక్ నియో బ్యాటరీ బ్యాకప్, ఇతర ఫీచర్లు ఇవే

విద్యార్థులకు రోజంతా చదువుకోవడానికి, ప్రాజెక్టులు చేయడానికి బ్యాటరీ చాలా ముఖ్యం. మ్యాక్‌బుక్ నియో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 16 గంటల వరకు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. వీడియో కాల్స్ కోసం 1080p ఫేస్‌టైమ్ కెమెరా, స్పష్టమైన మాటల కోసం రెండు మైక్రోఫోన్లు, అద్భుతమైన సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్నాయి. మొత్తానికి, ఆపిల్ ఎకోసిస్టమ్‌లోకి తక్కువ ధరలో ప్రవేశించాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories