Business Ideas: ఉద్యోగం చేసే చాలా మంది వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏదో ఒక రోజు మంచి వ్యాపారం మొదలు పెట్టాలని ప్లాన్స్ వేస్తుంటారు. మరి మార్కెట్లో తక్కువ పోటీ ఉండి, మంచి లాభాలు పొందే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వంతంగా ఎదగాలనుకునే యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉండటంతో చాలామంది వ్యాపారం మొదలుపెట్టేందుకు భయపడుతున్నారు. నిజానికి కొన్ని వ్యాపారాల్లో పోటీ చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి విభాగాల్లో అడుగు పెడితే స్థిరమైన ఆదాయం సాధించవచ్చు. అలాంటి వాటిలో టాయిలెట్ బ్రష్ తయారీ ఒకటి.
25
టాయిలెట్ బ్రష్ తయారీ ఎందుకు ప్రత్యేకం?
ప్రతి ఇల్లు, హోటల్, లాడ్జ్, ఆసుపత్రి, ఆఫీస్‌లో తప్పనిసరిగా అవసరమయ్యే వస్తువు టాయిలెట్ బ్రష్. డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. కానీ తయారీ యూనిట్లు చాలా కొద్దిగా మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా హోల్‌సేల్ విక్రేతలే మార్కెట్‌లో కనిపిస్తారు. అందుకే ఈ తయారీ వ్యాపారంలో పోటీ తక్కువగా ఉంటుంది.
35
ప్రారంభ పెట్టుబడి, మిషిన్ వివరాలు
ఈ వ్యాపారం ప్రారంభించేందుకు పెద్ద స్థాయి పెట్టుబడి అవసరం లేదు. సెమీ ఆటోమెటిక్ బ్రష్ తయారీ మిషిన్ ధర సుమారు రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకూ ఉంటుంది. ఫుల్లీ ఆటోమెటిక్ మిషిన్ ధర దాదాపు రూ.6 లక్షల వరకూ ఉంటుంది. రా మెటీరియల్ ఖర్చు ప్రారంభంలో రూ.40 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉంటుంది. మిషిన్ సరఫరా చేసే సంస్థలే రా మెటీరియల్ సప్లై చేస్తారు. తయారీ శిక్షణ కూడా అందిస్తారు. ఒక చిన్న షెడ్, ఇద్దరు నుంచి ముగ్గురు కార్మికులు ఉంటే సరిపోతుంది.
ఒక టాయిలెట్ బ్రష్ తయారీ ఖర్చు సగటున రూ.20 లోపే ఉంటుంది. మార్కెట్ రేటు కనీసం రూ.60 కాగా హోల్‌సేల్ ధర సుమారు రూ.40గా ఉంటుంది. ఒక్క బ్రష్‌పై దాదాపు రూ.20 లాభం వస్తుంది. రోజుకు 100 బ్రష్‌లు విక్రయిస్తే సుమారు రూ.6,000 ఆదాయం వస్తుంది. నెల లెక్కన లాభం రూ.1 లక్షకు పైగా చేరుతుంది. ఉత్పత్తి పెరిగితే లాభాలు మరింత పెరుగుతాయి.
55
వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి.?
ప్రారంభంలో లోకల్ హోల్‌సేలర్లు, హార్డ్‌వేర్ షాపులకు సరఫరా చేయవచ్చు. తర్వాత ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లిస్టింగ్ చేయొచ్చు. హోటల్ చైన్‌లు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లతో డైరెక్ట్ ఒప్పందాలు చేసుకోవచ్చు. బ్రష్ డిజైన్, కలర్, ప్యాకింగ్ మెరుగుపరిస్తే బ్రాండ్‌గా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ MSME రిజిస్ట్రేషన్ తీసుకుంటే సబ్సిడీ రుణాలు లభించే ఛాన్స్ ఉంటుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ రంగంలో అప్పటికే అనుభవం ఉన్న వారిని నేరుగా సంప్రదించడం ఉత్తమం.