Business Ideas: మన చుట్టూ కనిపించే కొన్ని వస్తువులతో పెద్దగా ఉపయోగం లేదని అనుకుంటాం. అయితే సరిగ్గా ఆలోచిస్తే ఎందుకు పనికిరాని వాటితో కూడా సిరులు కురిపించవచ్చు. అలాంటి వాటిలో కొబ్బరి చిప్పలతో చేసే ఓ వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి చిప్పలను కాల్చి తయారు చేసే బొగ్గును “కోకోనట్ షెల్ చార్కోల్” అని అంటారు. ఇది అనేక పరిశ్రమల్లో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యూటీ ప్రాడక్ట్స్ తయారీలో, యాక్టివేటెడ్ కార్బన్ తయారీలో ఈ బొగ్గును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే నీటి శుద్ధి యంత్రాలు, ఫిల్టర్లు, గ్యాస్ మాస్క్‌లు, కొన్ని మెడిసిన్ తయారీ పరిశ్రమల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. అందుకే చిన్న స్థాయిలో తయారు చేసినా కూడా మంచి మార్కెట్ లభిస్తుంది.
25
ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఏం కావాలి.?
కొబ్బరి బొగ్గు వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు. చిన్న స్థలం, కొబ్బరి చిప్పలు, వాటిని కాల్చడానికి అవసరమైన యంత్రం ఉంటే సరిపోతుంది. మొదట స్థానిక మార్కెట్‌లు, హోటళ్లు, కొబ్బరి విక్రయ కేంద్రాల నుంచి చిప్పలను సేకరించాలి. తర్వాత వాటిని ప్రత్యేక యంత్రంలో కాల్చి బొగ్గుగా తయారు చేస్తారు. కొందరు సాధారణంగా మంటపై కూడా కాల్చి తయారు చేస్తారు. అయితే యంత్రం ద్వారా తయారు చేస్తే నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
35
ఇంతకీ కొబ్బరి బొగ్గు ఉపయోగం ఏంటి.?
కొబ్బరి చిప్పల నుంచి తయారైన బొగ్గుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఫేస్ ప్యాక్‌లు, స్కిన్‌కేర్ ఉత్పత్తుల తయారీతో పాటు సబ్బులు, బ్యూటీ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తుంటారు. అలాగే నీటి శుద్ధి ఫిల్టర్లలో, ఎయిర్ ప్యూరిఫైయర్‌లలో, గ్యాస్ మాస్క్‌లు, కొన్ని సైనిక పరికరాల్లో కూడా వాడుతున్నారు. దీంతో మార్కెట్లో దీనికి నిరంతరం డిమాండ్ ఉంటుంది.
తయారైన బొగ్గును చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి బ్యూటీ ఉత్పత్తుల తయారీ కంపెనీలకు అమ్మవచ్చు. అలాగే యాక్టివేటెడ్ కార్బన్ తయారు చేసే పరిశ్రమలకు కూడా సరఫరా చేయవచ్చు. ఇప్పటి కాలంలో చాలా మంది ఈ ఉత్పత్తిని ఆన్‌లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నారు. సరైన మార్కెటింగ్ చేస్తే పెద్ద కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కొబ్బరి బొగ్గు ధర కిలోకు సుమారు రూ.50 నుంచి రూ.70 వరకు ఉంటుంది.
55
ఈ వ్యాపారంలో ఉన్న ప్రత్యేక అవకాశాలు
ఈ వ్యాపారం ప్రత్యేకత ఏమిటంటే ఇది పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా వ్యర్థంగా భావించే కొబ్బరి చిప్పలను ఉపయోగించడం వల్ల వ్యర్థాలు తగ్గుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు. మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు కలిసి ప్రారంభిస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడి, ఎప్పుడూ ఉండే డిమాండ్ కారణంగా ఇది మంచి చిన్న స్థాయి వ్యాపారంగా మారే అవకాశం ఉంది.