Vacant Plot Income: చాలా మంది ఇంటిస్థలాలు, ప్లాట్లు కొని అలా ఖాళీగా వదిలేస్తారు. కానీ ఆ భూమిని సరిగ్గా వాడుకుంటే అదనపు ఆదాయం సంపాదించవచ్చు. ఎలాంటి పంటలు ఆ చిన్న ప్లాటులో పండించడం వల్ల డబ్బు సంపాదించవచ్చో తెలుసుకోండి.
ఇంటి స్థలం కొని చాలా మంది అలా ఖాళీగా వదిలేస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడిగా కొన్న ప్లాట్లు, నిర్మాణం జరగక అలా పడుంటాయి. కానీ ఆ భూమిని అలా వదిలేయకుండా కొంచెం ప్లాన్ చేసుకుంటే ఆ ఖాళీ స్థలం నుంచి అదనపు ఆదాయం పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో తాత్కాలికంగా కొన్ని పంటలు వేస్తే మంచి లాభాలు వస్తాయి.
25
ఈ మొక్కలను పెంచండి
చాలా తక్కువ స్థలంలోనే సులువుగా పెంచగలిగే మొక్కలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా పెరిగే ఔషధ మొక్కలు ఎంపిక చేసుకుని పెంచడం ముఖ్యం. కలబంద (అలోవెరా), లెమన్ గ్రాస్, తులసి, పుదీనా వంటి మొక్కలు తక్కువ నీటితోనే పెరుగుతాయి. వీటికి ఫార్మా, సౌందర్య సాధనాల తయారీలో మంచి డిమాండ్ ఉంది. కొన్ని నెలల్లోనే పంట చేతికి వస్తుంది కాబట్టి, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం సంపాదించవచ్చు.
35
పండ్ల మొక్కల పెంపకం
పండ్ల మొక్కలను పెంచడం కూడా ఒక మంచి ఆలోచన. డ్రాగన్ ఫ్రూట్, జామ, నిమ్మ వంటి మొక్కలను చిన్న స్థలాల్లో కూడా పెంచవచ్చు. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్‌కు ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ఒక్కసారి నాటితే చాలా ఏళ్లపాటు పంటను అందిస్తుంది. కాబట్టి, ఇది భూ యజమానులకు దీర్ఘకాలిక లాభాన్ని అందిస్తుంది.
పూల తోటలు పెంచడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మల్లె, గులాబీ, బంతి వంటి పూలను తక్కువ స్థలంలో కూడా సాగు చేయవచ్చు. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు పూలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దీనివల్ల నిరంతరం ఆదాయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
55
ఈ సింపుల్ పంటలు
ఖాళీగా ఉన్న ప్లాట్లలో కూరగాయలు పండించడం కూడా మంచి నిర్ణయమే. టమాటా, మిరప, బెండ, ఆకుకూరలు వంటివి తక్కువ కాలంలోనే కోతకు వస్తాయి. దగ్గర్లోని మార్కెట్లలో అమ్ముకుంటే రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. ఇంటి నిర్మాణం చేపట్టే వరకు ఇలాంటి పంటలు వేయడం వల్ల భూమిని కాపాడుకోవడంతో పాటు, అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.