Business Ideas: చాలామంది వ్యాపారం ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి ఉండాలని భావిస్తుంటారు. కేవలం రూ. 5,000 అంతకన్నా తక్కువ పెట్టుబడితో చేయదగ్గ వ్యాపారాల గురించి బిజినెస్ నిపుణులు వివరించారు. తక్కువ బడ్జెట్‌లో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ వివరాలు..
ప్రస్తుత ఆర్థికకాలంలో వ్యాపారం చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ పెట్టుబడి లేక వెనకడుగు వేస్తుంటారు. కేవలం రూ. 5,000 అంతకన్నా తక్కువ పెట్టుబడితో చేయదగ్గ వ్యాపారాల గురించి బిజినెస్ నిపుణులు వివరించారు. తక్కువ బడ్జెట్‌లో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఈ బిజినెస్ ఐడియాస్..
25
సున్నా పెట్టుబడి బిజినెస్ ఐడియా
పెట్టుబడి అవసరం లేని వ్యాపారాల్లో 'ట్యూషన్లు' చెప్పడం అత్యుత్తమమైనది. మన దగ్గర ఉన్న విద్యా నైపుణ్యాన్ని ఉపయోగించి ఇంట్లోనే కూర్చుని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు గణితం, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులు బోధించవచ్చు. ఒక 10 నుండి 20 మంది విద్యార్థులతో నెలకు రూ. 30,000 నుండి రూ. 60,000 వరకు సంపాదించడం చాలా సులభమని తెలిపారు. దీనికి కావలసింది కేవలం మీ దగ్గర ఉన్న జ్ఞానం, పది నిమిషాల సమయం మాత్రమే.
35
డిజిటల్ మార్కెటింగ్
మీ వ్యాపారం గురించి అందరికీ తెలియాలంటే వేల రూపాయలు ఖర్చు చేయనక్కర్లేదు. భారతదేశంలో దాదాపు 120 కోట్ల మొబైల్ వినియోగదారులు ఉన్నారని, అందులో 90 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని కృష్ణ గారు గుర్తు చేశారు. సోషల్ మీడియాను (WhatsApp, Facebook, Instagram) సరైన పద్ధతిలో వాడుకుంటే మీ ట్యూషన్ సెంటర్ లేదా మరే ఇతర సేవనైనా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా ఉచితంగానే చేయవచ్చు.
కేవలం రూ. 5,000 పెట్టుబడితో చేసే వ్యాపారాల ద్వారా కూడా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే, అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్‌లోని చిన్న వ్యాపారాలకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, బ్యాంక్ లోన్ల ద్వారా ఎంతో సహకారం అందిస్తోందని తెలిపారు. వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి మెంటార్‌షిప్, వర్క్‌షాప్‌ల ప్రాధాన్యం కూడా ఈ సందర్భంగా వివరించారు.
55
డబ్బు కంటే తెలివితేటలు
వ్యాపారానికి డబ్బు కంటే తెలివితేటలు, సరైన ప్లానింగ్ ముఖ్యమని.. మన దగ్గర తక్కువ పెట్టుబడి ఉన్నా.. మన చుట్టుప్రక్కల ఉన్న వనరులతో మనం స్టార్ట్ చేసే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని బిజినెస్ నిపుణులు అంటున్నారు.