House: తక్కువ జీతంతో సొంత ఇల్లు కొనడం ఎలాగో తెలియక సతమతమవుతున్నారా? ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈఎంఐ భారం లేకుండా రూ. 50 లక్షల ఇల్లు కొనే అద్భుతమైన ఫార్ములాను వివరించారు.
ఒకప్పుడు చిట్టీలు వేయడం లేదా బ్యాంకులో దాచుకోవడం సురక్షితంగా అనిపించేది. కానీ 2026 నాటి పరిస్థితుల్లో పెరుగుతున్న ధరలను అందుకోవాలంటే స్టాక్ మార్కెట్ డిజిటల్ అసెట్స్ వైపు మొగ్గు చూపాలి. ఇందులో మనీ అన్లిమిటెడ్‌గా గ్రో అవుతుంది. లీగల్‌గా వైట్ మనీ రూపంలో మనకు అందుతుంది.
25
ఇల్లు ఎప్పుడు కొనాలి?
చాలామంది ఉద్యోగం రాగానే ఇల్లు కొనేయాలని ఆరాటపడతారు. కానీ 40-45 ఏళ్ల వయస్సు ఇల్లు కొనడానికి ఐడియల్ టైమ్ అని ఆయన చెబుతున్నారు. అప్పటికి మన కెరీర్ ఎక్కడ సెటిల్ అవుతుంది, పిల్లల అవసరాలు ఏమిటి అనే క్లారిటీ వస్తుంది. అంతవరకు చేసిన పెట్టుబడులు మనకు అప్పు లేకుండా ఇల్లు కొనే స్థాయికి చేరుస్తాయి.
35
రోజూ పది రూపాయలతో కోటీశ్వరులు!
డబ్బులు తక్కువ ఉన్నాయని ఇన్వెస్ట్ చేయడం ఆపకూడదు. నెలకు రూ. 300 లేదా రోజుకు కేవలం రూ. 10 ఎస్ఐపీ(SIP) చేస్తే అది లాంగ్ టర్మ్‌లో కోటి రూపాయల వరకు సంపదను సృష్టిస్తుంది. చుక్క చుక్క కలిస్తేనే కుండ నిండుతుందన్న సామెత పెట్టుబడుల విషయంలోనూ అక్షర సత్యం. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే చిన్న మొత్తంతో మొదలుపెట్టండి.
మీరు నేరుగా భూమి కొనలేకపోతే స్టాక్ మార్కెట్ ద్వారా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. దీన్నే 'రీట్స్' అంటారు. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే, అపార్ట్మెంట్స్ లేదా కమర్షియల్ బిల్డింగ్స్ ద్వారా వచ్చే అద్దెను మీకు షేర్ చేస్తారు. భవిష్యత్తులో ఆస్తిని అమ్మడం కంటే ఇలా డిజిటల్ గా మేనేజ్ చేయడం చాలా ఈజీ.
55
ఫైనాన్షియల్ నాలెడ్జ్ ముఖ్యం
చాలామంది స్టాక్ మార్కెట్ అంటే భయపడతారు, కానీ అది నాలెడ్జ్ లేకపోవడం వల్ల వచ్చే భయం మాత్రమే. మీ ఫోన్ ద్వారానే డిజిటల్ అసెట్స్ మేనేజ్ చేయడం నేర్చుకుంటే, మీ సంపదను మీరే పెంచుకోవచ్చు. దీనివల్ల మీ పిల్లలకు కూడా ఆస్తులను ట్రాన్స్‌ఫర్ చేయడం సులభం అవుతుంది.