Business Idea: డబ్బులతో పాటు పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకోవాలనే ఆశ చాలా మందిలో ఉంటుంది. అయితే ఇందుకోసం భారీగా డబ్బు అవసర పడుతుందని భావిస్తారు. కానీ తెలివిగా ఆలోచిస్తే చాలా తక్కువ ఖర్చుతో గొప్ప వ్యాపారాలను ప్రారంభించవచ్చు.
ప్రస్తుతం బ్రాండ్ల ప్రమోషన్ అనగానే హీరోలు, క్రికెటర్లు, జాతీయ స్థాయి సెలబ్రిటీలు గుర్తుకు వస్తారు. వీళ్లతో ప్రమోషన్ చేయాలంటే భారీ ఖర్చు అవసరం. చిన్న వ్యాపారులకు అది సాధ్యం కాదు. ఇక్కడే హైపర్ లోకల్ బ్రాండ్ ప్రమోషన్ బిజినెస్ అవసరం మొదలవుతుంది. ఒక ప్రాంతంలో ప్రజలకి బాగా తెలిసిన లోకల్ ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా అదే ప్రాంతంలోని వ్యాపారాలను ప్రమోట్ చేయడం ఈ మోడల్ సారాంశం.
25
లోకల్ ఇన్‌ఫ్లూయెన్సర్ల శక్తి ఎందుకు ముఖ్యం?
ఒక ప్రాంతంలో యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా గుర్తింపు పొందిన వ్యక్తులు ఉంటారు. వీళ్ల మాటకు అక్కడి ప్రజలు ఎక్కువ నమ్మకం చూపిస్తారు. పెద్ద సెలబ్రిటీ కంటే కూడా లోకల్ ఇన్‌ఫ్లూయెన్సర్ చెప్పిన మాట ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు రోజూ కనిపించే మనుషులు. ఈ నమ్మకమే ఈ బిజినెస్‌కు బలమైన పునాది.
35
ఒక గొడుగు కింద ఇన్‌ఫ్లూయెన్సర్లను తీసుకురావడం ఎలా?
ఈ బిజినెస్ మోడల్‌లో ప్రధాన పాత్ర మనదే. మనం ఒక బ్రిడ్జ్‌లా పనిచేస్తాం. వివిధ ప్రాంతాల్లో ఉన్న లోకల్ ఇన్‌ఫ్లూయెన్సర్లను ఆన్‌లైన్‌లో అప్రోచ్ అవ్వాలి. వాళ్ల వివరాలు, ఫాలోవర్ల డేటా, కంటెంట్ స్టైల్ అన్నీ ఒక నెట్‌వర్క్‌లా సిద్ధం చేయాలి. ఇలా ఒక ప్లాట్‌ఫామ్ లేదా గ్రూప్ రూపంలో తీసుకురావడం వల్ల వ్యాపారస్థులకు ఒకే చోట పరిష్కారం లభిస్తుంది.
ఈ బిజినెస్ ప్రారంభించాలంటే పెద్ద ఆఫీస్ అవసరం లేదు. భారీ పెట్టుబడి అవసరం లేదు. మొదట ఫోన్ ఉంటే చాలు. ఇన్‌ఫ్లూయెన్సర్లతో కాల్ లేదా మెసేజ్ ద్వారా మాట్లాడొచ్చు. వ్యాపార సంస్థల దగ్గరకు నేరుగా వెళ్లి డీల్ మాట్లాడొచ్చు. ప్రారంభంలో చిన్న వీడియోలు, రీల్స్ ద్వారా ప్రమోషన్ మొదలు పెట్టి, తర్వాత స్కేల్ పెంచుకుంటూ వెళ్లొచ్చు.
55
కమిషన్ విధానం, లాభాల అవకాశాలు
ఈ బిజినెస్‌లో లాభం రెండు వైపుల నుంచి వస్తుంది. ఒక వైపు ఇన్‌ఫ్లూయెన్సర్ నుంచి కమిషన్ తీసుకోవచ్చు. మరో వైపు వ్యాపారస్థుల నుంచి ఫీజు తీసుకోవచ్చు. ఒక్క వీడియో ప్రమోషన్‌కే రెండు కమిషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతంలో ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్సర్లు, ఎక్కువ వ్యాపారాలు కలిస్తే ఆదాయం కూడా స్థిరంగా పెరుగుతుంది. దీన్ని సరిగా నిర్వహిస్తే దీర్ఘకాలంలో బలమైన లోకల్ బ్రాండ్ ప్రమోషన్ నెట్‌వర్క్‌గా మార్చుకోవచ్చు. ఇలాంటి మోడల్ బిజినెస్‌లు సరిగ్గా సక్సెస్ అయితే మీ పేరు మారుమోగడం ఖాయం.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. వ్యాపారం మొదలు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సూచనలు పాటించడం ఉత్తమం.