BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుతో ఇండియాకు కలిగే ప్రయోజనాలేంటి?

Published : Sep 11, 2026, 12:10 PM IST

BRICS Summit 2026: భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు 2026 భారత్ మండపంలో జరగనుంది. బ్రిక్స్ సదస్సు ద్వారా భారత్‌కు దౌత్యం, వాణిజ్యం, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో ఎలాంటి ప్రయోజనాలు దక్కనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
డాలర్‌కు చెక్.. మన యూపీఐకి గ్లోబల్ గుర్తింపు.. బ్రిక్స్ సదస్సుతో భారత్‌కు కలిగే లాభాలివే

గ్లోబల్ పాలిటిక్స్‌లో ఇప్పుడు అందరి దృష్టి ఇండియా పైనే ఉంది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ప్రతిష్ఠాత్మక భారత్ మండపంలో జరగనుంది. భారత్ అధ్యక్షతన "Building for Resilience, Innovation, Cooperation and Sustainability" అనే వైవిధ్యమైన థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అసలు ఈ మెగా సమ్మిట్ వల్ల సామాన్య భారతీయుడికి, మన దేశ ఆర్థిక వ్యవస్థకు, వ్యాపార రంగానికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఆ వివరాలు గమనిస్తే..

26
గ్లోబల్ దౌత్యంలో భారత్ సరికొత్త పవర్

ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో 11 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, గ్లోబల్ జీడీజీలో 40 శాతం వాటా ఈ కూటమిదే. ఇలాంటి అత్యంత ప్రభావవంతమైన కూటమికి భారత్ అధ్యక్షత వహించడం మన దౌత్య శక్తికి పెద్ద మైలేజ్. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్ వంటి గ్లోబల్ స్టేజ్ లపై బిగ్ సౌండ్‌తో వినిపించే అవకాశం భారత్‌కు దక్కింది.

36
వ్యాపారం, స్టార్టప్‌లు, ఎగుమతులకు బిగ్ బూస్ట్

ఈ సదస్సు మన దేశీయ వ్యాపారాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తుంది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, తయారీ రంగం, ఫార్మాస్యూటికల్స్, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులకు బ్రిక్స్ దేశాల్లో భారీ మార్కెట్ లభించనుంది.

బ్రిక్స్ స్టార్టప్‌ ఇన్నోవేషన్ ఫండ్ : కొత్తగా వచ్చే భారతీయ స్టార్టప్‌ల కోసం 'బ్రిక్స్ ఇన్‌క్యుబేటర్ నెట్‌వర్క్'ను ముందుకు తెచ్చారు. దీనివల్ల భారతీయ యువతకు అంతర్జాతీయ నిధులు, భాగస్వామ్యాలు లభిస్తాయి.

సరఫరా గొలుసు స్థిరత్వం: సెమీకండక్టర్లు, లిథియం వంటి కీలక ఖనిజాలు, ఫార్మా ముడి పదార్థాల విషయంలో చైనా లేదా పాశ్చాత్య దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి స్థానిక సరఫరా వ్యవస్థలను బలపరచవచ్చు.

46
రూపాయి క్రేజ్.. యూపీఐ అంతర్జాతీయ విప్లవం

డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, సభ్య దేశాల మధ్య స్థానిక కరెన్సీలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా చర్చలు వేగవంతమవుతున్నాయి. దీనివల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చులు తగ్గి, రూపాయి అంతర్జాతీయ వినియోగం పెరుగుతుంది. మరోవైపు, భారత్ సృష్టించిన డిజిటల్ విప్లవం యూపీఐ, ఆధార్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నమూనాలను బ్రిక్స్ దేశాలకు విస్తరించే ఛాన్స్ ఉంది. దీనివల్ల భారతీయ ఫిన్‌టెక్ కంపెనీలకు విదేశాల్లో భారీ అవకాశాలు వస్తాయి.

56
రైతులకు ప్రోత్సాహం, ఇంధన భద్రత

రైతన్నకు టెక్నాలజీ: 'బ్రిక్స్ నెట్ వర్క్ ఆన్ డిజిటల్ అగ్రికల్చర్, ఏఐ ఆధారిత వ్యవసాయ పద్ధతుల ద్వారా కొత్త విత్తనాలు, శాటిలైట్ టెక్నాలజీ భారత రైతన్నకు అందుబాటులోకి రానున్నాయి.

ఎనర్జీ సెక్యూరిటీ: రష్యా, సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్ వంటి చమురు ఉత్పాదక దేశాలు బ్రిక్స్ లో ఉండడం భారత్‌కు చాలా కీలకం. పశ్చిమాసియా సంక్షోభాల వేళ ముడి చమురు, గ్యాస్ సరఫరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోవడానికి, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ మార్పిడికి ఈ స్టేజ్ ఎంతో దోహదపడుతుంది.

66
స్థానిక టూరిజం, ఉపాధి అవకాశాల పెంపు

న్యూఢిల్లీలో 350కి పైగా అంతర్జాతీయ సమావేశాలు, బిజినెస్ ఫోరమ్‌లు జరగడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారత్‌ వైపు చూస్తున్నారు. దీనివల్ల తాత్కాలికంగా హోటళ్లు, విమానయానం, ఈవెంట్ మేనేజ్‌మెంట్, రవాణా రంగాలకు భారీగా ఆదాయం పెరగడమే కాకుండా, భవిష్యత్తులో డిజిటల్ ఫీల్డ్, గిగ్ వర్కర్లకు గ్లోబల్ లెవెల్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మొత్తానికి, 18వ బ్రిక్స్ సదస్సు అనేది భారత్‌కు కేవలం ఒక మీటింగ్ మాత్రమే కాదు.. మన ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, దౌత్య సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అత్యంత కీలకమైన స్టేజ్ అని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories