మీకు బిజినెస్ చేయడం ఇష్టమా? అయితే వేసవి కాలం మీకు మంచి టైం. ఈ సమ్మర్ లో తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ గాని మీరు స్టార్ట్ చేస్తే తక్కువ కాలంలోనే మంచి లాభాలు పొందుతారు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి కావాలి? లాభాలు ఎలా ఉంటాయి? ఎలా స్టార్ట్ చేయాలి వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వేసవిలో ప్రారంభించడానికి ట్రావెల్ & టూరిజం బిజినెస్ బెస్ట్ ఐడియా. ఎందుకంటే పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లకు కూడా అవసరమైన సెలవులు వేసవిలో దొరుకుతాయి. ఇక బిజినెస్ మెన్ ఫ్యామిలీస్ కూడా వేసవిలో కచ్చితంగా టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఇలా ప్రతి కేటగిరీలో జనాలు సమ్మర్ లో వెకేషన్ కి వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయంలో మీరు గాని ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు.
tourist bus
ట్రావెల్ & టూరిజం బిజినెస్ కి పెట్టుబడి
ఈ బిజినెస్ ప్రారంభించడానికి మీ దగ్గర రూ.50,000 ఉంటే చాలు. వీటితో లాప్‌టాప్ కొనుక్కొని, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకుంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో టూరిస్ట్ కనెక్షన్లు పెంచుకోవాలి. ముందుగానే ఆయా టూరిస్ట్ ప్లేసెస్ లో హోటల్స్, లాడ్జ్ లు, గైడ్ లతో కాంటాక్ట్ ఏర్పరచుకోవాలి.
టికెట్స్ బుక్ చేస్తే చాలు..
వేసవి సెలవుల్లో ప్రజలు ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో వారికి మీరు ఇంటర్నెట్ ద్వారా ట్రిప్ ప్లానింగ్ సలహాలు ఇచ్చి ఛార్జ్ తీసుకోవచ్చు. అంతేకాకుండా బస్, ట్రైన్, ఫ్లైట్ టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్, లోకల్ టూర్స్ లాంటి సర్వీసులు ఆఫర్ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు.
మీరే టూరిస్ట్ బస్ నడపండి..
టికెట్స్ బుకింగ్ ద్వారా కంటే మీరే ఒక టూరిస్ట్ బస్ వేశారంటే డబుల్ ప్రాఫిట్స్ పొందొచ్చు. దీనికోసం సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకోండి. ముందుగా మీరు ఒక ప్రైవేట్ బస్సును, డ్రైవర్లను అద్దెకు తీసుకోండి. సోషల్ మీడియాలోని అనేక ప్లాట్ ఫాంలలో టూరిస్ట్ సర్వీసులను తెలియజేస్తూ పోస్టులు పెట్టండి. ఉదాహరణకు వేసవిలో కొడైకెనాల్, ఊటీ, గోవా, కేరళ, కులుమనాలి వంటి ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేయండి.
టికెట్ ధర ఎంతంటే..
అక్కడకు వెళ్లే దూరాన్ని బట్టి టికెట్ రేట్, ఫుడ్ ఛార్జీలు లెక్కించి టికెట్ రేట్ ఫిక్స్ చేయండి. మీరు ఏర్పాటు చేసిన బస్సులో సౌకర్యాలను వివరించండి. సమ్మర్ కాబట్టి ఏసీ బస్సు అయితే ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి. కచ్చితంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఈ ఐడియా సక్సెస్ అయితే టూర్స్ అండ్ ట్రావెల్స్ ని ఏడాది మొత్తం కొనసాగిస్తూ హనీమూన్ & ఫ్యామిలీ టూర్స్, ట్రెక్కింగ్ & అడ్వెంచర్ టూర్స్, బడ్జెట్ టూర్స్ అంటూ రకరకాలు టూర్స్ ప్లాన్ చేయండి.