car washing Business
దేశంలో కార్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఇంటికొక బైక్ ఉండడం ఎంత కామన్‌గా ఉండేదో ఇప్పుడు కారు కూడా అంతే కామన్‌గా మారుతోంది. సెకండ్ హ్యాండ్ కారు అయినా సరే కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా ప్రభావత తర్వాత ఈ ట్రెండ్ ఎక్కువైంది. కార్ల విక్రయాలు పెరగడంతో కారు వాషింగ సెంటర్లకు కూడా డిమాండ్ పెరిగింది.
car washing Business
దీంతో కారు వాషిగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా మంచి లాభాలు ఆర్జించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలనుకునే వారికి ఈ వ్యాపాం బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. కార్ వాషింగ్ వ్యాపారాన్ని కనీసం రూ. 25 వేల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత మీకు వచ్చే ఆదాయం ఆధారంగా పెట్టుబడి పెంచుకుంటూ వెళ్లొచ్చు.
కారు వాషింగ్ కోసం ముందు స్థలాన్ని చూసుకోవాలి. ఇందుకోసం కనీసం ఒక 150 గజాల స్థలం కావాల్సి ఉంటుంది. రోడ్డు పక్కన ఉండే ఖాళీ స్థలాన్ని ఇందుకోసం లీజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మిషిన్స్ విషయానికొస్తే కారు వాషింగ్ మిషిన్స్ ప్రారంభ ధర రూ. 12 వేల నుంచి మొదలవుతుంది. ఇతర పైపులు సామాగ్రి కోసం మో రూ. 14 వేల వరకు అవుతుంది.
car washing Business
వీటితో పాటు వాక్యూమ్ క్లీనర్, షాంపూ, గ్లౌజులు, టైర్ పాలిష్, డ్యాష్‌బోర్డ్ పాలిష్ వంటి సామాగ్రి అవసరపడుతుంది. వీటి ధర రూ. 10 వేలలోపే ఉంటుంది. ప్రస్తుతం ఒక్క కారు వాషింగ్‌కి సుమారు రూ. 250 వరకు వసూలు చేస్తున్నారు. రోజులో కనీసం 8 నుంచి 10 కార్లు వాషింగ్‌కు వచ్చినా నెలకు రూ.50 వేల ఆదాయం ఏటూ పోదు. అయితే కారు వాషింగ సెంటర్ ఏర్పాటు చేసే స్థలం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అపార్ట్‌మెంట్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు చేరువలో వీటిని ఏర్పాటు చేస్తే మంచి గిరాకీ ఉంటుంది.
car washing Business
అయితే మొదట్లో స్థలాన్ని లీజుకు తీసుకోవడంతో పాటు అవసరమైన వస్తువులను సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేయడం ఉత్తమం. ఒకవేళ వ్యాపారం డెవలప్ అవుతుందన్న నమ్మకం కలిగితే సొంత స్థలాన్ని తీసుకొని వ్యాపారం కొనసాగిస్తే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఇక మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలి. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్టులు చేయాలి. ఇలా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు.