Banking: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.? ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మార‌నున్న రూల్స్ తెలుసుకోవాల్సిందే

Published : Feb 08, 2026, 12:30 PM IST

Banking: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా కొన్ని సేవలపై ఛార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 

PREV
15
ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న కొన్ని డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు ఇకపై ఛార్జీలు విధించనుంది. ముఖ్యంగా అత్యవసర నగదు బదిలీకి విస్తృతంగా ఉపయోగించే IMPS సేవలపై కొత్త రుసుములు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులు ఫిబ్రవరి 15, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.

25
IMPS సేవలపై ఎందుకు మార్పులు

యూపీఐ పేమెంట్ లిమిట్ దాటిన సందర్భాల్లో వినియోగదారులు IMPS సేవలను ఆశ్రయిస్తారు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వంటి డిజిటల్ ఛానెళ్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో టెక్నాలజీ నిర్వహణ ఖర్చులు అధికమయ్యాయని ఎస్‌బీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో జరిగే లావాదేవీలపై స్వల్ప ఛార్జీలు విధిస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

35
కొత్త ఛార్జీల వివరాలు ఇవే

సవరించిన నిబంధనల ప్రకారం రూ.25,000 వరకు చేసే IMPS ట్రాన్స్‌ఫర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ.25,001 నుంచి రూ.1 లక్ష వరకు పంపితే రూ.2 + జీఎస్‌టీ విధిస్తారు. రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.6 + జీఎస్‌టీ ఉంటుంది. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పంపితే రూ.10 + జీఎస్‌టీ చెల్లించాలి. ఈ ఛార్జీలు డిజిటల్ ఛానెళ్ల ద్వారా జరిగే లావాదేవీలకే వర్తిస్తాయి.

45
బ్రాంచ్ ద్వారా లావాదేవీలకు పాత రేట్లే

బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి నేరుగా IMPS లావాదేవీలు చేసే కస్టమర్లకు ఇప్పటివరకు అమలులో ఉన్న ఛార్జీలే కొనసాగుతాయి. అక్కడ పంపే మొత్తాన్ని బట్టి రూ. 2 నుంచి రూ. 20 వరకు రుసుము వసూలు చేస్తారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.

55
ఎవరికి మినహాయింపు

కొన్ని ప్రత్యేక ఖాతాదారులకు ఈ కొత్త ఛార్జీలు వర్తించవు. డిఫెన్స్, సెంట్రల్ గవర్నమెంట్, రైల్వే, పోలీస్ విభాగాల శాలరీ అకౌంట్లు ఉన్నవారు, శౌర్య ఫ్యామిలీ పెన్షన్ పొందేవారు, ఎస్‌బీఐ రిష్టే అకౌంట్ హోల్డర్లకు IMPS సేవలు మునుపటిలాగే ఉచితం. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక విలువ గల డిజిటల్ లావాదేవీలపై స్వల్ప రుసుములు విధించడం ద్వారా బ్యాంక్ తన డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయాలని చూస్తోంది. భారీ మొత్తాల ట్రాన్స్‌ఫర్లు చేయాల్సిన కస్టమర్లు ఫిబ్రవరి 15కు ముందే లావాదేవీలు పూర్తి చేసుకుంటే అదనపు భారం తప్పించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories