Egg Business: లక్షల్లో సంపాదించాలని చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. తక్కువ రిస్క్‌తో భారీగా ఆదాయం ఆర్జించే అలాంటి ఒక బెస్ట్ ఐడియా లేయర్ కోడి ఫామ్. ఈ బిజినెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లేయర్ కోడి ఫారం అంటే గుడ్లు పెట్టే కోళ్లను పెంచి వాణిజ్యంగా గుడ్ల ఉత్పత్తి చేయడం. లేయర్ కోళ్లు ఒక రోజు వయస్సు నుంచే పెంచాలి. ఇవి సుమారు 18–19 వారాలకే గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. 72–78 వారాల వరకు నిరంతరం గుడ్లు ఇస్తాయి. ఒక ఆరోగ్యకరమైన లేయర్ కోడి వారానికి కనీసం 4–6 గుడ్లు పెడుతుంది. సంవత్సరానికి 300–325 గుడ్లు పెడుతుంది.
25
సరైన జాతి ఎంపిక – ఇదే లాభానికి కీలకం
లేయర్ కోళ్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి.
వైట్ ఎగ్ లేయర్స్: చిన్న పరిమాణం, తక్కువ ఫీడ్ తింటాయి. గుడ్లు తెల్లగా ఉంటాయి
బ్రౌన్ ఎగ్ లేయర్స్: ఈ కోడి గుడ్లు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి. ఫీడ్ ఎక్కువ తింటాయి, గుడ్లు పెద్ద సైజ్‌లో, బ్రౌన్ రంగులో ఉంటాయి. వాణిజ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
35
ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.?
ఈ కోళ్ల ఫారంను నివాస ప్రాంతాలకు దగ్గరగా కాకుండా, పట్టణాలకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నీరు, రవాణా సౌకర్యం ఉండాలి. ప్రభుత్వం అనుమతులు లభించే ప్రాంతాన్ని మాత్రమే ఎంచుకోవాలి. బ్యాటరీ కేజ్ సిస్టమ్ లేయర్లకు బెస్ట్ అని చెప్పొచ్చు.
ప్రారంభంలో ఉదాహరణకు 1000 కోళ్లు కొనుగోలు చేశారనుకుందాం. సాధారణంగా వీటికి డే ఓల్డ్ చిక్స్ (Day Old Chicks) కొనుగోలు చేస్తారు. ఒక్క లేయర్ కోడి (డే ఓల్డ్ చిక్) ధర సుమారు రూ. 40 నుంచి రూ. 55 వరకు ఉంటుంది. మంచి బ్రాండ్ హ్యాచరీ (Isa Brown, BV-380 లాంటి జాతులు): ₹50 – ₹60 మధ్య ఉంటాయి. అంటే 1000 కోళ్లకు సుమారు రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టాలి. ఇతర ఖర్చులకు రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి అవసరపడుతుంది.
55
లాభాలు ఎలా ఉంటాయి.?
20 వారాలకు 5% కోళ్లు గుడ్లు పెడతాయి. 26–30 వారాల మధ్య గరిష్ట ఉత్పత్తి జరుగుతుంది. లాభాల విషయానికొస్తే గుడ్ల సైజ్ ఆధారంగా ధర మారుతుంది. రోజుకు సగటు 800–900 గుడ్లు పెట్టినా ఒక్క గుడ్డు రూ. 5–7 పలుకుతుందని అనుకుందాం. ఈ లెక్కన చూసుకుంటే నెలకు లక్షల రూపాయల టర్నోవర్ పొందే అవకాశం ఉంది.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారం మొదలు పెట్టే ముందు ఇందులో అనుభవం ఉన్న వారిని నేరుగా సంప్రదించడం ఉత్తమం.