ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. నాలుగో దశ గురించి కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందులో ఉన్న ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే.. ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు మాత్రమే ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు విలీనం అవుతాయని అర్థమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రూరల్ బ్యాంకులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో మూడు RRBలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, బీహార్, ఒడిశా, రాజస్థాన్‌లలో రెండు RRBలు ఉన్నాయి. ఉత్తరాఖండ్, త్రిపుర, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల్లో ఒక్కోటి చొప్పున గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి.