TVS iQube: 123 కి.మీల మైలేజ్‌తో అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌.. ఫీచ‌ర్స్ తెలిస్తే వెంట‌నే కొనేస్తారు.

Published : Jul 03, 2025, 11:39 AM IST

ప్ర‌స్తుతం దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల జోరు పెరుగుతోంది. దేశంలో దాదాపు అన్ని ప్ర‌ముఖ ఆటో మొబైల్ సంస్థ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా టీవీఎస్ కంపెనీ ఐక్యూబ్ సిరీస్‌లో భాగంగా కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. 

PREV
15
టీవీఎస్ ఐక్యూబ్ కొత్త వెర్ష‌న్

2025 సంవత్సరానికి TVS మోటార్ కంపెనీ తమ పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ iQubeకి కొత్త 3.1 కిలో వాట్స్‌ బ్యాటరీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది (IDC ప్రకారం). దీని ధర రూ. 1,03,727 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. దీనిలో కొత్త హిల్ హోల్డ్ అసిస్టుతో పాటు ఆధునిక UI/UX ఇంటర్‌ఫేస్ వంటి ఫీచ‌ర్ల‌ను అందించారు.

25
స్టైలిష్ కలర్ వేరియంట్లు

ఈ కొత్త మోడల్‌లో నాలుగు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెర్ల్ వైట్, టైటానియం గ్రే, స్టార్లైట్ బ్లూ విత్ బీజ్ (డ్యూయల్ టోన్), కాపర్ బ్రౌన్ విత్ బీజ్ (డ్యూయల్ టోన్) క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చారు. మ‌రీ ముఖ్యంగా యువ‌త‌ను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటీని తీసుకొచ్చారు.

35
భారీగా అమ్మ‌కాలు

ఇప్పటివరకు TVS iQube 6 లక్షలకుపైగా యూనిట్లు విక్రయించడంతో, ఇది కంపెనీకి అత్యంత విజయవంతమైన EVగా నిలిచింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,900 కంటే ఎక్కువ షోరూమ్‌లు ద్వారా అందుబాటులో ఉంది.

45
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే.?

ఫీచ‌ర్ల విష‌యంలో పెద్ద‌గా మార్పులేమి చేయ‌లేదు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ ట్యూబ్ షాక్ అబ్సార్బర్లు ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో 220 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 మిల్లీమీటర్ల డ్రమ్ బ్రేక్ అమర్చారు.

ఇతర వేరియంట్లలాగే ఈ మోడల్‌లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT డిస్‌ప్లేను అందించారు. అయితే 3.1kWh వేరియంట్ ధర బేసిక్ మోడల్ కంటే సుమారుగా రూ. 12,000 ఎక్కువగా ఉంది.

55
ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు పోటీనిచ్చేలా

TVS iQube ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఈవీ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. ఇది Ola, Ather Energy, Bajaj Chetak, Hero Vida లాంటి టాప్ బ్రాండ్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ప్రత్యేకంగా ధర, రేంజ్, సౌలభ్యం, ఫీచర్ల పరంగా iQube చాలా బలంగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories