TVS: పిచ్చి పిచ్చిగా కొనేస్తున్నారు.. రోజుకు 3వేలకి పైగా అమ్ముడ‌వుతోన్న ఈ స్కూటీలో అంత‌లా ఏముంది?

Published : Jun 02, 2025, 01:59 PM IST

ప్ర‌స్తుతం యువ‌త స్కూటీల‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే మార్కెట్లోకి వ‌చ్చిన ఓ కొత్త స్కూట‌ర్‌ను జ‌నాలు పిచ్చిపిచ్చిగా కొనేస్తున్నారు. ఇంత‌కీ ఏంటా స్కూట‌ర్‌, అందులో అంతలా ఏముందంటే..

PREV
15
టీవీఎస్ జూపిట‌ర్‌కు పెరిగిన ఆద‌ర‌ణ

టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌కు వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ మ‌ధ్య జ‌రిగిన అమ్మ‌కాలే దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. అందుబాటులో ఉన్న‌ ధర, మెరుగైన మైలేజ్, ఆధునిక ఫీచర్లు వంటి కారణాలతో రోజురోజుకు ఈ స్కూటీపై ఆసక్తి పెరుగుతోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొనుగోలు జరుగుతున్న ఈ స్కూటీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
ఏప్రిల్ 2025లో రికార్డు స్థాయిలో అమ్మ‌కాలు

గత నెల (ఏప్రిల్ 2025)లో TVS జూపిటర్ అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క నెలలో 1,02,588 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే రోజుకి సగటున 3,419 స్కూటర్లు అమ్ముడవడం విశేషం. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే అమ్మకాలు 33 శాతం పెరిగాయి, అంటే వినియోగదారుల నమ్మకం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

35
ధ‌ర‌, వేరియంట్స్

టీవీఎస్ జూపిటర్ 110, 125 సీసీ రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. టీవీఎస్ జూపిట‌ర్ 110 సీసీ ప్రారంభ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధ‌ర రూ. 76,691 కాగా, 125 సీసీ ఎక్స్ షోరూమ్ స్టార్టింగ్ వేరియంట్ ధ‌ర రూ. రూ. 80,640గా ఉంది. తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే అన్ని ర‌కాల ట్యాక్స్‌ల‌తో క‌లిపి ఆన్‌రోడ్ ధ‌ర రూ. 98,750 నుంచి ప్రారంభమవుతుంది.

45
ఇంజిన్, మైలేజ్

జూపిటర్ 110 మోడల్‌లో 113.3cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ స్కూటీ 7.91 bhp వ‌ద్ద 5000 rpm ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 9.2 Nm టార్క్, ఎలక్ట్రిక్ అసిస్ట్‌తో 9.8 Nm వరకు పెరుగుతుంది ఈ స్కూటీ గ‌రిష్టంగా గంటకు 82 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.

55
ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే

జూపిటర్ స్కూటర్‌లో స్టైలిష్ డిజైన్‌తో పాటు సురక్షితమైన ఫీచర్లూ ఉన్నాయి. హై-ఎండ్ మోడల్ అయిన SmartXonnect Discలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక టెక్నాలజీని అందించారు. ఈ స్కూటీని డాన్ మ్యాట్ బ్లూ, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్,  మీటియోర్ రెడ్ గ్లోస్ వంటి క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories