TVS: 145 కిలోమీట‌ర్ల మైలేజ్‌, టైప్‌సీ ఛార్జ‌ర్‌.. టీవీఎస్ నుంచి అదిరిపోయే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

Published : Aug 25, 2026, 10:00 PM IST

TVS: ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ స్కూటర్ సంస్థ టీవీఎస్ ఐక్యూబ్‌లో కొత్త మిలియ‌న్ఆర్ స్పెష‌ల్ ఎడిష‌న్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఐక్యూబ్ 10 లక్షల మంది కస్టమర్లను దాటిన సందర్భంగా కంపెనీ ఈ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది.

PREV
15
10 లక్షల మంది కస్టమర్లను దాటిన ఐక్యూబ్‌

టీవీఎస్ ఐక్యూబ్ దేశంలో మంచి ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటివరకు ఈ స్కూటర్‌ను 10 లక్షల మందికి పైగా కొనుగోలు చేశారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని టీవీఎస్ మిలియ‌న్ఆర్ స్పెష‌ల్ ఎడిష‌న్‌ను తీసుకొచ్చింది. సాధారణ iQubeతో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్‌లో డిజైన్, కలర్, కొన్ని సౌకర్యాల్లో మార్పులు చేశారు.

25
కొత్త అక్వారా గ్రీన్ కలర్

మిలియ‌న్ఆర్ స్పెష‌ల్ ఎడిష‌న్‌లో ప్రధాన ఆకర్షణ దాని కొత్త లుక్. ఈ స్కూటర్‌కు అక్వారా గ్రీన్ డ్యూయల్ టోన్ కలర్ ఇచ్చారు. దీనికి ప్రత్యేక గ్రాఫిక్స్ జోడించారు. అలాగే MillionR పేరుతో ప్రత్యేక బ్యాడ్జింగ్ అందించారు. దీంతో సాధారణ iQubeతో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ప్రీమియం సీట్ కవర్ కూడా ఇందులో ఉంది.

35
యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్

కొత్త iQube MillionR Editionలో రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని యూఎస్‌బీ టైప్‌సీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. గతంలో ఐక్యూబ్‌లో USB-A పోర్ట్ సీటు కింద ఉండేది. ఫోన్ ఛార్జ్ చేయాలంటే సీటు తెరవాల్సి వచ్చేది. ఇప్పుడు టైప్‌-సీ పోర్ట్‌ను సులభంగా ఉపయోగించుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణ సమయంలో ఫోన్ ఛార్జింగ్ మరింత సులభంగా మారుతుంది.

45
ముందు భాగంలో స్టోరేజ్ బాక్స్

కొత్త ఎడిషన్‌లో మరో ఉపయోగకరమైన మార్పు ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్. ఇందులో మొబైల్ ఫోన్‌తో పాటు చిన్నచిన్న రోజువారీ వస్తువులను పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను కూడా ఈ స్థలంలో ఉంచుకోవచ్చు. నగరాల్లో రోజూ స్కూటర్‌పై ప్రయాణించే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.

55
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 145 కి.మీల‌ రేంజ్

TVS iQube MillionR Special Editionలో 145 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ వస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే అధికారిక పరీక్షా ప్రమాణాల ప్రకారం ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 145 కిమీ వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితుల్లో వచ్చే రేంజ్ దీనికంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉండొచ్చు. ట్రాఫిక్, ప్రయాణ వేగం, రైడర్ బరువు, రోడ్డు పరిస్థితులు, స్కూటర్‌లో ఉపయోగించే ఫీచర్లు వంటి అంశాలపై రేంజ్ ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే కొత్త కలర్, ప్రత్యేక బ్యాడ్జింగ్, ప్రీమియం సీట్‌తో పాటు యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్, ఫ్రంట్ స్టోరేజ్ వంటి సౌకర్యాలను జోడించడం ద్వారా TVS iQube MillionR Special Editionను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.

Read more Photos on
click me!

Recommended Stories