RVXలో ముందు భాగంలో USD ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్ ఉన్నాయి. ముందు, వెనుక రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు అందించారు. బైక్‌లో 3.5 అంగుళాల IP67 రేటెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, టెలిమాటిక్స్, OTA అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవే కాకుండా జియో-ఫెన్సింగ్, కాల్, మెసేజ్ అలర్ట్స్, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ మోడ్, వాక్ అసిస్ట్, ఇమ్మొబిలైజర్, వెహికల్ లొకేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీంతో రోజువారీ వినియోగంతో పాటు స్మార్ట్ ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చే వారికి ఆర్‌వీఎక్స్ ఉపయోగకరంగా ఉండేలా కనిపిస్తోంది.