Bike: ఫస్ట్ టైమ్ బైక్ కొనడం చాలా మందికి స్పెషల్ ఫీలింగ్. కానీ కొంతమంది తొందరలో లేదా సరైన సమాచారం లేకపోవడంతో తప్పులు చేస్తారు. ఈ తప్పు డబ్బు, సమయం రెండింటినీ వృథా చేస్తుంది. అయితే బైక్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటంటే
చాలామంది బైక్ డిజైన్ చూసి వెంటనే ఇష్టపడిపోతారు. కానీ లుక్ ఒక్కటే చూసి కొనడం సరైన నిర్ణయం కాదు. కొన్ని బైక్‌లు సిటీ రైడింగ్‌కి బాగుంటాయి, మరికొన్ని లాంగ్ డ్రైవ్స్‌కి సరిపోతాయి. మీరు మీ బైక్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారు.? మీ అవసరం ఏంటి? ఇవి ముందుగా ఆలోచించి బైక్ ఎంచుకోవాలి.
25
బడ్జెట్ మించిపోయే ఖర్చు చేయడం
EMI ఆప్షన్ ఉంది కాబట్టి చాలామంది ఖరీదైన బైక్ తీసుకుంటారు. కానీ తర్వాత EMIలు, పెట్రోల్ ఖర్చులు, సర్వీస్ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. మీ బడ్జెట్‌లోనే సులభంగా మేనేజ్ చేయగలిగే బైక్ తీసుకోవడం మంచిది. బైక్ ధరతో పాటు ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా కలిపి ఆలోచించాలి.
35
మైలేజ్, మెయింటెనెన్స్‌ను పట్టించుకోకపోవడం
కొంతమంది బైక్ కొనేటప్పుడు మైలేజ్ గురించి పట్టించుకోరు. కానీ రోజూ వాడే వాళ్లకు ఇది చాలా ముఖ్యమైన విషయం. మంచి మైలేజ్ ఉన్న బైక్ తీసుకుంటే పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది. అలాగే సర్వీస్ సెంటర్లు సులభంగా దొరికే కంపెనీ బైక్ అయితే మరింత సౌకర్యం ఉంటుంది.
టెస్ట్ రైడ్ చేయకుండా బైక్ కొనడం పెద్ద తప్పు. ప్రతి బైక్ రైడింగ్ అనుభవం వేరుగా ఉంటుంది. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంట్రోల్, బ్యాలెన్స్ ఇవన్నీ టెస్ట్ రైడ్‌లోనే తెలుస్తాయి. కనీసం ఒకసారి డ్రైవ్ చేసి చూసిన తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకోవాలి.
55
ఫీచర్స్, ఇంజిన్, డాక్యుమెంట్స్‌ను సరిగా చూడకపోవడం
ఇప్పుడు బైక్‌లలో డిజిటల్ మీటర్, ABS, బ్లూటూత్ వంటి ఫీచర్స్ ఉంటాయి. కానీ వాటిని అర్థం చేసుకోకుండా తీసుకోవడం వృథా ఖర్చు. మీకు అవసరమైన ఫీచర్స్ ఉన్న బైక్ మాత్రమే తీసుకోండి. అవసరం లేకుండా ఎక్కువ పవర్ ఉన్న ఇంజిన్ తీసుకుంటే ఖర్చు పెరుగుతుంది. సిటీకి 100–125cc చాలానే సరిపోతుంది. అలాగే ఇన్సూరెన్స్, RC, ఇతర పత్రాలు తప్పకుండా చెక్ చేయాలి.