టీవీఎస్ కంపెనీకి చెందిన iQube ST ఈ స్కూటర్ టాప్ వేరియంట్. ఇందులో 7 అంగుళాల TFT టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ ద్వారా మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్, OTA అప్డేట్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా క్రాష్ అలర్ట్, ఫాల్ అలర్ట్, హిల్ హోల్డ్ అసిస్టు వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ 3.5 kWh, 5.3 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 1.71 లక్షలు (ఎక్స్ షోరూమ్).