Bajaj Pulsar 180: ఒకప్పుడు భారత బైక్ మార్కెట్ ను ఏలిన బజాజ్ పల్సర్ 180 మళ్లీ మార్కెట్‌లోకి వచ్చింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ బైక్‌ను బజాజ్ ఆటో తిరిగి విడుదల చేసింది. ఈ బైక్‌లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ బైక్‌లో గతంలో ఉన్నదే 178.61 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 16.77 bhp పవర్‌ను 8,500 rpm వద్ద 15 Nm టార్క్‌ను 6,500 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ మధ్యస్థ వేగంలో మంచి పంచ్ ఇవ్వడంలో ప్రసిద్ధి. రోజువారీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా హైవే రైడింగ్‌కూ సరిపడేలా పనితీరు అందిస్తుంది. కాగా కంపెనీ 2022లో ఈ మోడల్‌ను కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు 2026 మోడల్ Pulsar 180ను రూ.1.22 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరతో భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. పాత మోడల్‌కు ఉన్న ప్రత్యేకతను కొనసాగిస్తూ, కొన్ని కొత్త మార్పులతో ఈ బైక్‌ను తీసుకొచ్చింది.
25
క్లాసిక్ డిజైన్‌కు కొత్త టచ్
డిజైన్ విషయానికి వస్తే బజాజ్ కంపెనీ పాత పల్సర్ స్టైల్‌ను ఎక్కువగా మార్చలేదు. ఎందుకంటే ఆ డిజైన్ ఇప్పటికీ చాలా మందికి గుర్తుండేలా ఉంటుంది. మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ష్రౌడ్స్, స్పోర్టీ స్టాన్స్ ఇవన్నీ పాత పల్సర్ లుక్‌ను అలాగే కొనసాగిస్తున్నాయి. అయితే కొత్త మోడల్‌లో బ్లాక్ థీమ్ పెయింట్, కొత్త గ్రాఫిక్స్‌తో బైక్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు మడ్‌గార్డ్‌పై కార్బన్ ఫైబర్ స్టైల్ ఫినిష్ ఇవ్వడం కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది.
35
కొత్త LED లైటింగ్ ఫీచర్లు
ఈ మోడల్‌లో ముఖ్యమైన మార్పు LED హెడ్‌లైట్. పాత మోడల్‌లో ఉన్న హాలోజన్ లైట్‌ను తీసేసి కొత్త LED లైట్ ఇచ్చారు. దీంతో రాత్రి సమయంలో స్పష్టమైన వెలుతురు, మెరుగైన విజిబిలిటీ, ఆధునిక లుక్ లభిస్తాయి. ఇక టర్న్ ఇండికేటర్లు కూడా LEDగా మార్చారు. దీంతో బైక్ లుక్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
ఈ బైక్‌లో ఫుల్ డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. ఇది ఇప్పటికే పల్సర్ 150, పల్సర్ 220F మోడళ్లలో ఉన్న డిస్‌ప్లే తరహానే ఉంటుంది. ఈ డిస్‌ప్లేలో స్పీడ్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ స్థాయి ఇతర ముఖ్య సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది.
55
ధర ఎంతంటే.?
బజాజ్ పల్సర్ 180 ధర రూ.1.22 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రస్తుతం ఇది ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. బజాజ్ పల్సర్ లైనప్‌లో ఈ బైక్ పల్సర్ 150, పల్సర్ 220F మధ్యలో ఉండే మోడల్‌గా నిలుస్తుంది. అంటే రోజువారీ ఉపయోగం, అలాగే కొంచెం ఎక్కువ పనితీరు కోరుకునే రైడర్లకు ఇది మంచి ఎంపికగా చెప్పొచ్చు.