Six Seater Family Cars ఆరు సీట్లలో ఇవే తోపు ఫ్యామిలీ కార్లు.. ఓ లుక్కేయండి

Published : Apr 07, 2025, 08:35 AM IST

చీపెస్ట్ ఫ్యామిలీ కార్: ఒక కుటుంబమంతా కలిసి ప్రయాణం చేయాలంటే.. కనీసం ఆరు సీట్లు ఉన్న కారు అయినా కావాలి. సీట్లు పెరిగినకొద్దీ ధర పెరగడం సహజం. ఎంపీవీ నుంచి ఎస్‌యూవీ వరకు, ఈ కార్లు రూ.20 లక్షలైనా ఉంటాయి. మరి ఇందులోనూ మంచి ఫీచర్లు, తక్కువ ధరలో దొరికే కార్లు ఏంటో ఒక్కసారి చూద్దామా..

PREV
13
Six Seater Family Cars ఆరు సీట్లలో ఇవే తోపు ఫ్యామిలీ కార్లు.. ఓ లుక్కేయండి
ఆరు సీట్లలో ఇవే తోపు

భారత మార్కెట్లో కారు కొనే ప్రతి ఒక్కరూ రేటు గురించే ఆలోచిస్తారు. దానికి తగ్గట్టుగా ఫీచర్లు ఉంటేనే ముందుకెళ్తారు. మరి వారి ఆశలు నెరవేర్చేలా మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆరు సీట్ల కార్లు ఏంటో తెలుసుకోండి.

మారుతి సుజుకి XL6
మారుతి సుజుకి కార్లల్లో XL6 అంత పాపులర్ కాకపోవచ్చు, కానీ దీని రెండో వరుసలో వేర్వేరు సీట్లు ఉన్నాయి. XL6లో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది పెట్రోల్, సీఎన్జీ రెండిట్లోనూ దొరుకుతుంది. పెట్రోల్ వెర్షన్ ధర 11.71 లక్షల నుంచి మొదలవుతుంది.

23
మహీంద్రా స్కార్పియో క్లాసిక్

పాత స్కార్పియో క్లాసిక్ ఇప్పటికీ మార్కెట్లో బెస్ట్ ఎస్‌యూవీ. దీని S11 మోడల్‌లో రెండో వరుసలో వేర్వేరు సీట్లు ఉన్నాయి. స్కార్పియో క్లాసిక్ ధర 17.50 లక్షల నుంచి మొదలవుతుంది.

కియా కేరెన్స్

కియా కేరెన్స్ నమ్మదగిన కార్. ఇది మూడు ఇంజన్ వేరియంట్లలో దొరుకుతుంది. దీనిలో 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజన్ ఒకటి. కియా కేరెన్స్ ధర 10.60 లక్షల నుంచి మొదలవుతుంది.

33
ఎంజీ హెక్టర్ ప్లస్

ఎంజీ హెక్టర్ ప్లస్ ఆరు సీట్ల మోడల్ కూడా ఉంది. ఇందులో 1.5 లీటర్ల పెట్రోల్, 2 లీటర్ల డీజిల్ ఇంజన్ ఉంది. హెక్టర్ ప్లస్ ధర 17.50 లక్షల నుంచి మొదలవుతుంది.

మహీంద్రా XUV700

మహీంద్రా XUV700 AX7, AX7L మోడళ్లలో ఆరు సీట్ల ఆప్షన్ ఉంది. ఇందులో 2 లీటర్ల పెట్రోల్, 2.2 లీటర్ల డీజిల్ ఇంజన్ ఉంది. దీని ధర 19.69 లక్షల నుంచి మొదలవుతుంది.]

Read more Photos on
click me!

Recommended Stories