చిన్న కార్ల సెగ్మెంట్..
ఇండియాలో తక్కువ ధర ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దాంతో అన్ని కంపెనీలు ఆ సెగ్మెంట్ పై దృష్టి పెడుతున్నాయి. చాలా కంపెనీలు ఇండియన్ కార్ మార్కెట్‌లో తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. అంతేకాదు, విదేశీ కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ తన తొలి చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ VF3ని ఇండియాలో రిలీజ్ చేయనుంది. ఇండియాలో ఇది MG కామెట్ EVతో పోటీ పడుతుంది. కొత్త VinFast VF3 EVలో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో చూద్దాం రండి.
VinFast VF3 ఎలక్ట్రిక్ కారులో 18.64 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 215 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. 0 నుంచి 50 kmph స్పీడ్‌ను 5.3 సెకన్లలో అందుకోవచ్చు. ఈ 4-సీటర్ ఎలక్ట్రిక్ కారు రెండు డోర్లు ఉన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్. ఇది సిటీలో తిరగడానికి డిజైన్ చేశారు. VF3 ఎలక్ట్రిక్ కారు ఫ్రంట్ V-షేప్ గ్రిల్, క్రోమ్ ఫినిష్ డిజైన్‌తో ఫ్లోటింగ్ రూఫ్, బ్లాక్ కలర్ పిల్లర్స్‌తో కనిపిస్తుంది.
కొలతల గురించి మాట్లాడితే VF3 ఎలక్ట్రిక్ కారు పొడవు 3,190mm, వెడల్పు 1,679mm, ఎత్తు 1,652mm ఉంది. దీని వీల్‌బేస్ 2,075మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 191మిమీ. ఇంటీరియర్ గురించి మాట్లాడితే ఇందులో 10-ఇంచ్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇవ్వొచ్చు. ఇది కాకుండా మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, 2-స్పోక్ స్టీరింగ్ లాంటి ఫీచర్స్ ఉండొచ్చు.
సేఫ్టీ కోసం ఇందులో 2 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, చైల్డ్ సీట్ మౌంట్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-హోల్డ్ అసిస్ట్ లాంటి ఫీచర్స్ ఇచ్చారు.
ధర
ఎంత ఖర్చవుతుంది
VinFast VF3 ధర రూ.10 లక్షల ఎక్స్ షోరూమ్ దగ్గర మొదలవుతుంది. అదే MG కామెట్ EV ధర రూ.7 లక్షల ఎక్స్ షోరూమ్. 4.99 లక్షల ప్రారంభ ధరతో బ్యాటరీ రేంజ్ ప్లాన్ కింద కామెట్ EV కూడా తీసుకోవచ్చు. కామెట్ తో పోలిస్తే ధర ఎక్కువైనా.. ఫీచర్లు రెట్టింపు ఉన్నాయంటోంది తయారీదారు.