రెండో సీఎన్జీ కారు
ఇండియాలో ఫస్ట్ కూపే ఎస్‌యూవీ కర్వ్ విడుదల చేసిన తర్వాత, టాటా మోటార్స్ త్వరలో కర్వ్ డార్క్ ఎడిషన్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. దీంతోపాటు కంపెనీ కర్వ్ డార్క్ ఎడిషన్‌తోనే ఆగిపోవడం లేదు. కర్వ్ సీఎన్జీని కూడా రంగంలోకి దించుతోంది. దీనికి సంబంధించిన స్పై ఫొటోలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి.
నాలుగు ఆప్షన్లలో
టాటా కర్వ్ సీఎన్జీ
ఇండియన్ కార్ మార్కెట్‌ను చూస్తే, టాటా నెక్సాన్ మాత్రమే నాలుగు ఫ్యూయల్ ఆప్షన్లతో (పెట్రోల్, సీఎన్జీ, డీజిల్, ఎలక్ట్రిక్ వెహికల్) అందుబాటులో ఉంది. వెహికల్ ఎంథూజియాస్ట్ ఉదయ్ సుబ్బెగర్ తీసిన రీసెంట్ స్పై పిక్చర్స్ చూస్తే, టాటా నాలుగు ఫ్యూయల్ ఆప్షన్లతో తన సెకండ్ వెహికల్‌ను రిలీజ్ చేస్తున్నట్లుగా ఉంది.
ఖచ్చితంగా, మనం టాటా కర్వ్ గురించి మాట్లాడుతున్నాం. రీసెంట్ టెస్ట్ షాట్స్ సీఎన్జీ పవర్‌ట్రెయిన్‌ను ప్యాక్ చేసినట్లుగా కనిపిస్తోంది. టాటా మోటార్స్ కర్వ్ సీఎన్జీని రిలీజ్ చేస్తే, ఇండియాలో ఫస్ట్ కూపే ఎస్‌యూవీ నాలుగు ఫ్యూయల్ ఆప్షన్లను అందిస్తుంది: పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్. అంతేకాకుండా, ట్విన్ సిలిండర్ టెక్నాలజీని అందించే ఇండియాలో ఇది ఫస్ట్ అండ్ ఓన్లీ ఎస్‌యూవీ అవుతుంది.
ధర కాస్త అధికం
ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు?
ప్రస్తుతానికి, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ సీఎన్జీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో వస్తున్నాయి. కానీ ఇది సింగిల్ సిలిండర్ ఇంప్లిమెంటేషన్‌తో ఉంది. టాటా ఐ-సీఎన్జీ ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో, సీఎన్జీ ట్యాంక్‌లను ఫాల్స్ ఫ్లోర్ కింద నీట్‌గా దాచిపెట్టొచ్చు. ఇది చూడటానికి బాగుండటమే కాకుండా ఎక్కువ బూట్ స్పేస్‌ను కూడా అందిస్తుంది.
టాటా మోటార్స్ కర్వ్ సీఎన్జీని ఫెస్టివల్ సీజన్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీని ధర దాదాపు ₹1 లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది. దీనికి లార్జ్ బూట్ ఓపెనింగ్ ఉండటంతో, కంపెనీ ఎక్కువ గ్యాస్ పట్టే పెద్ద సిలిండర్‌లను ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇతర టాటా ఐ-సీఎన్జీ వెహికల్స్ లాగానే, సీఎన్జీ స్టార్ట్, సీమ్ లెస్ స్విచింగ్, ఇతర ఫీచర్లను కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
పవర్ఫుల్ ఇంజిన్
ఫీచర్ల పరంగా చూస్తే, టాటా సీఎన్జీ వేరియంట్‌కు కొత్తగా ఏమీ యాడ్ చేయకపోవచ్చు. టాటా తక్కువ-స్పెసిఫికేషన్ రెవోట్రాన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే సీఎన్జీని అందించే అవకాశం ఉంది. పవర్ ఫుల్ హైపర్‌యాన్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించకపోవచ్చు. సీఎన్జీలో నడుస్తున్నప్పుడు 99 బీహెచ్‌పీ, 170 ఎన్ఎం ట్యూన్ స్టేట్‌ను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. టాటా కర్వ్ సీఎన్జీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్‌తో కూడా ఇది సాధ్యమే.