Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు

Published : Jan 13, 2026, 06:31 PM IST

Maruti Suzuki S-Presso : సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా మెయింటేన్ చేసేలా చవకైన కార్లను తీసుకువస్తుంటుంది మారుతి సుజుకి. ఇలా తక్కువ శాలరీ ఉద్యోగుల సొంతకారు కలను సాకారం చేసేలా ఓ మోడల్ ను తీసుకువచ్చింది. దానిగురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

PREV
15
వేతనజీవుల కోసం లోబడ్జెట్ కారు

Maruti Suzuki S-Presso : ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నిరోజులు ఇలా బైక్ పై ప్రయాణం... కారు తీసుకుంటే హాయిగా తిరగొచ్చని చాలా మంది భావిస్తారు. లగ్జరీ కోసం కాదు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం, కుటుంబ అవసరాల కోసం కారు కొనాలనుకునే మధ్యతరగతి వేతనజీవుల కల కలగానే మిగిలిపోతోంది. వచ్చే జీతమేమో తక్కువ... కారు డౌన్ పేమెంట్, ఈఎంఐ లేమో ఎక్కవ... దీంతో కొనాలని ఆశ ఉన్నా కొనలేకపోతున్నారు. ఇలాంటి సామాన్య, మధ్యతరగతి ప్రజలకోసం మారుతి సుజుకి ఓ బడ్జెట్ ఫ్రెండ్లీ కారును తీసుకువచ్చింది.

25
ఎస్-ప్రెస్సో ధర ఎంత..?

నెలకు కేవలం 20,000 నుండి 25,000 రూపాయలు సంపాదించే ఉద్యోగులు, వ్యాపారులకు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఛాయిస్. దీని ప్రారంభ ధర రూ.3,50,000... టాప్ వేరియంట్ ధర రూ.5,50,000 వరకు ఉంటుంది (రాష్ట్రం, నగరాన్ని బట్టి ధర మారుతుంది). కొంత డౌన్ పేమెంట్ చెల్లించి మిగతాది ఈఎంఐ (EMI) పెట్టుకోవచ్చు.

35
నెలకు ఈఎంఐ ఎంత చెల్లించాలి?

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సోను EMIలో కొనాలంటే మొదట కేవలం రూ.1-2 లక్షల డౌన్ పేమెంట్ కట్టండి. నెలనెలా ఈఎంఐ రూ.8-10 వేల వరకు ఉంటుంది. దీంతో మీకు రూ.2,50,000 వరకు జీతం ఉన్నా ఈజీగా చెల్లించవచ్చు... మీ కారు కలను సులభంగా నెరవేర్చుకోవచ్చు. కారు మెయింటెనెన్స్ తో పాటు ఇతర ఖర్చులకు జీతం డబ్బులు సరిపోతాయి.

45
ఏకంగా 33 కిలోమీటర్ల మైలేజీ..!

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సొ కారు మినీ ఎస్‌యూవీ లుక్‌ ఇస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కాబట్టి పల్లెటూళ్ళు, చిన్నచిన్న పట్టణాల్లో పాడైపోయిన రోడ్లపై కూడా మంచి పనితీరు ఇస్తుంది. దీని మైలేజ్ 24-26 kmpl. ఇందనం ఖర్చు మరింత తగ్గాలంటే సీఎన్జీ బెస్ట్... కిలో సీఎన్జీతో 33 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అయితే పెట్రోల్ కంటే సిఎన్జీ కారు ధర ఎక్కువగా ఉంటుంది.

55
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఫీచర్లు

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో వస్తోంది... ఇది 66PS హార్స్ పవర్, 89Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సిఎన్జి అయితే 56PS హార్స్ పవర్, 82 టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్నిబట్టి సిఎన్జీ కంటే పెట్రోల్ ఇంజన్ అధిక పికప్ కలిగి ఉంటుంది. కొత్త ఎస్-ప్రెస్సో టచ్ స్క్రీన్, USB కనెక్టివిటీ, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ ఫీచర్లు కలిగి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories