Cheapest Car in India : 6 ఎయిర్‌బ్యాగ్స్, 32 kmpl మైలేజ్ తో .. ఇండియాలో అత్యంత చౌక కారు ఇదే

Published : Mar 04, 2026, 03:37 PM IST

మిడిల్ క్లాస్ ప్రజలకు కార్లను అందుబాటులోకి తెచ్చిన ఘనత మారుతి సుజుకిదే. అత్యంత తక్కువ ధరలో ఇప్పటికే మార్కెట్లోకి అనేక కార్లను తీసుకువచ్చింది. ఇప్పుడు అత్యంత భద్రతా ప్రమాణాలతో సరికొత్త సెలెరియోను తీసుకువచ్చింది. 

PREV
15
ఇండియా రోడ్లపై సరికొత్త సెలెరియో

ఈ రోజుల్లో కారు కొనేటప్పుడు అందరూ మొదట చూసేది సేఫ్టీ ఫీచర్లే. ముఖ్యంగా కారులో ఎన్ని ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి... సేఫ్టీ రేటింగ్ ఎంత అని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అత్యంత చౌక ధరలో ఓ కారు లభిస్తోంది. భారత మార్కెట్లో సరికొత్త మారుతి సుజుకి సెలెరియో (Celerio) మోడల్ అదరగొడుతోంది. 

25
ఆకర్షణీయమైన రంగుల్లో సెలెరియో...

మారుతి సుజుకి గతేడాది సరికొత్త డిజైన్‌తో కొత్త సెలెరియో కారును లాంచ్ చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ యువతను, నగర ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఈ కారులోని అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్ ఇవ్వడం దీని ప్రధాన ప్రత్యేకత. 

ఈ మారుతి సెలెరియో విభిన్న రంగుల్లో లభిస్తోంది. స్పీడీ బ్లూ, గ్లిజనింగ్ గ్రే, ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, సాలిడ్ ఫైర్ రెడ్, కెఫీన్ బ్రౌన్, పెరల్ బ్లూయిష్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఈ కారు అందుబాటులో ఉంది. 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటంతో రోడ్లపై గుంతలు, ఎత్తుపల్లాలను సులభంగా దాటగలదు.

35
మారుతి సెలెరియో మైలేజ్ ఎంత..?

ఈ కారులో 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది సుమారు 68.5 PS శక్తిని, 90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్, AMT (ఆటో గేర్ షిఫ్ట్) ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో సీఎన్‌జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికొస్తే పెట్రోల్ మోడల్ లీటర్‌కు సుమారు 25 కి.మీ, సీఎన్‌జీ మోడల్ కిలోకు సుమారు 34 కి.మీ మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

45
భద్రతా ఫీచర్లు

భద్రతా ఫీచర్ల విషయంలో ఈ కారు అద్భుతంగా ఉంది. అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), 3-పాయింట్ సీట్ బెల్ట్‌ల వంటి ఫీచర్లను అందించారు. దీంతో కుటుంబాలకు, మొదటిసారి కారు కొనేవారికి ఇది సురక్షితమైన ఎంపికగా నిలుస్తుంది. కారు లోపల సౌకర్యవంతమైన, టెక్నాలజీ ఫీచర్లను కూడా జోడించారు.

55
సుజుకి సెలెరియో ధర..?

ఈ కారు ధరను చాలా తక్కువగా నిర్ణయించారు. పెట్రోల్ మోడల్ ప్రారంభ ధర రూ.4.69 లక్షలు కాగా, సీఎన్‌జీ మోడల్ ప్రారంభ ధర రూ.5.97 లక్షలుగా ఉంది. ఈఎంఐ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రూ.50,000 డౌన్‌పేమెంట్ చెల్లించి లోన్ తీసుకుంటే 5 ఏళ్ల కాలానికి నెలకు సుమారు రూ.9,385 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువ ధరలో సురక్షితమైన, మంచి మైలేజ్ ఇచ్చే సిటీ హ్యాచ్‌బ్యాక్ కోసం చూసేవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్.

Read more Photos on
click me!

Recommended Stories