Suzuki e-Access : జపాన్ కంపెనీ సుజుకిి ఇటీవలే ఇండియన్ మార్కెట్లోకి ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకువచ్చింది. అయితే ఈ స్కూటర్ ను ఇప్పుడు ఏకంగా రూ.20,000 తగ్గింపు ధరకే కస్టమర్లకు అందిస్తోంది.
సుజుకి తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇ-యాక్సెస్ (E-Access) కొనే కస్టమర్లకు రూ.19,800 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఈ ఆఫర్లలో ఫైనాన్స్ స్కీమ్‌లు, లాయల్టీ బోనస్, ఎక్స్‌టెండెడ్ వారంటీలు ఉన్నాయి. ప్రారంభ ధర ఎక్కువగా ఉందని కొనడానికి వెనకాడుతున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు.
25
సుజుకి ఇ యాక్సెస్ అసలు ధర ఎంత?
Suzuki E-Access ఎక్స్-షోరూమ్ ధర రూ.1.88 లక్షలు. ఈ ధర ప్రీమియం విభాగంలో ఉంది. 'మేడ్ ఇన్ ఇండియా'లో భాగంగా తయారైన ఈ మోడల్‌ను దేశీయ, ఎగుమతి మార్కెట్ల కోసం డెవలప్ చేశారు. దీన్ని తొలిసారిగా 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు.
35
ఇ యాక్సెస్ ఫీచర్లు
ఈ స్కూటర్‌లో 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని ఉపయోగించారు. ఇది ఎక్కువ కాలం మన్నుతుందని, అధిక స్థిరత్వం కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 95 కి.మీల రేంజ్, గంటకు 71 కి.మీ వేగం అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రిక్ మోటార్ 4.1 kW పవర్, 15 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎకో రైడ్‌తో సహా మూడు రైడ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
సాధారణ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు... ఫుల్ ఛార్జ్‌కు 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో కేవలం 1 గంట 12 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది. ధర కాస్త ఎక్కువైనా, అదనపు ఆఫర్ల వల్ల E-Access నమ్మకమైన, దీర్ఘకాలిక పెట్టుబడిగా మారుతుంది.
55
ఇ యాక్సెస్ కొనుగోలుపై స్పెషల్ ఆఫర్
సుజుకి ఇతర కంపెనీలతో కలిసి ప్రత్యేక లోన్ స్కీమ్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ లోన్ స్కీమ్స్ ద్వారా రూ.9,800 వరకు ఆదా చేసుకోవచ్చు. వడ్డీ రేటు 5.99 శాతం నుంచి మొదలవుతుంది. ఇప్పటికే సుజుకి వాహనం ఉన్నవారు E-Access కొంటే రూ.10,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. అంటే మొత్తంగా 19,800 ఆదా అవుతుంది. కొత్త కస్టమర్లకు ₹7,000 వెల్‌కమ్ ఆఫర్ ఇస్తున్నారు. అదనంగా రూ.4,000 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీని ఉచితంగా అందిస్తున్నారు. ఇది 7 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు వర్తిస్తుంది.