Maruti Ignis :రూ.8,12,000 కారు కేవలం రూ.7,43,000కే.. ఏకంగా రూ.69,000 తగ్గింపా..!

Published : Sep 15, 2025, 05:23 PM IST

Maruti Ignis : మారుతి సుజుకి తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్‌ ను భారీ డిస్కౌంట్లు ధరకు అందిస్తోంది. ఇగ్నిస్ దాని విభిన్నమైన డిజైన్, కాంపాక్ట్ సైజు, శక్తివంతమైన పనితీరుకు ప్రసిద్ధి చెందింది. దీని ధర ఎంత తగ్గిందో తెలుసా?

PREV
15
మారుతి ఇగ్నిస్ ధర భారీగా తగ్గింపు

Maruti Ignis : ప్రముఖ కార్ల బ్రాండ్ మారుతి సుజుకి తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇగ్నిస్‌ ధరను జీఎస్టీ మార్పుల తర్వాత భారీగా తగ్గించింది. జిఎస్టి వల్ల కలిగే లాభాలను కస్టమర్లకే అందిస్తోంది... అందకే ఇగ్నిస్ చాలా తక్కువధరకే వస్తోంది. ఇప్పుడు ఈ కారు కొనుగోలు చేసేవారికి దాదాపు ₹69,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. మారుతి ఇగ్నిస్ దాని విభిన్నమైన డిజైన్, కాంపాక్ట్ సైజు, శక్తివంతమైన పనితీరుకు ఎల్లప్పుడూ ప్రసిద్ధి చెందింది.

25
మారుతి ఇగ్నిస్ ధర ఇప్పుడెంత?

ఇగ్నిస్ బేస్ మోడల్ సిగ్మా ఎంటి ధర ₹5.85 లక్షల నుండి ₹5.35 లక్షలకు తగ్గింది. అత్యధిక ధర కలిగిన ఆల్ఫా ఏఎంటి వేరియంట్ ధర ₹8.12 లక్షల నుండి ₹7.43 లక్షలకు తగ్గింది. ఈ ధర తగ్గింపులతో SUV లాంటి డిజైన్ ఉన్న కాంపాక్ట్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కోరుకునే నగర వాసులకు ఇగ్నిస్ మరింత అందుబాటులోకి వచ్చింది.

35
మారుతి ఇగ్నిస్ ఫీచర్లు

మారుతి సుజుకి ఇగ్నిస్ దాని స్పోర్టీ, విభిన్నమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, చతురస్రాకారంలో ఉన్న వీల్ ఆర్చెస్, రూఫ్ రైల్స్, SUV లాంటి ఫ్రంట్ ప్రొఫైల్ వంటివి ఇందులో ఉన్నాయి. ఇక ఇగ్నిస్ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే… టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ప్లే స్టూడియో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎల్ఈడి హెడ్‌లైట్లు, అనేక కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి. భద్రతా ఫీచర్ల విషయానికొస్తే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి.

45
ఇగ్నిస్ ఇంజన్ సామర్థ్యమెంత?

ఇగ్నిస్‌లోని పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే… మారుతి ఇగ్నిస్ 1.2 లీటర్ K12 పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది దాదాపు 83 bhp శక్తిని, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

55
మారుతి ఇగ్నిస్ మైలేజ్ ఎంత?

ఇగ్నిస్ మైలేజ్ విషయానికొస్తే దాదాపు 20.89 కి.మీ/లీ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అందుకే నగరంలో ప్రయాణించడానికి, హైవేలపై డ్రైవింగ్‌కు ఈ కారు కస్టమర్లకు ఇష్టమైన ఎంపికగా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories