GST: జీఎస్టీ త‌గ్గింపుతో రూ. 72 వేల‌కే బైక్‌.. 70 కి.మీల మైలేజ్, మ‌రెన్నో ఫీచ‌ర్లు

Published : Sep 15, 2025, 12:24 PM IST

GST: భారతీయ మార్కెట్లో హోండా కంపెనీకి మంచి డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే. హోండా షైన్ వీటిలో ప్ర‌ధ‌మ స్థానంలో ఉంటుంది. తాజాగా జీఎస్టీ త‌గ్గింపుతో షైన్ బైక్‌పై భారీగా డిస్కౌంట్ ల‌భిస్తోంది. 

PREV
14
జీఎస్టీ తగ్గింపు వల్ల లాభం

ప్రస్తుతం షైన్ బైక్ ధర రూ.85,590 నుంచి రూ.90,341 వరకు ఉంది. దీనిపై 28% జీఎస్టీ పన్ను వసూలు చేస్తున్నారు. కానీ సెప్టెంబర్ 22, 2025 నుంచి 350సీసీ లోపు బైక్‌లపై జీఎస్టీ 18%కి తగ్గనుంది. దీంతో హోండా షైన్‌ను ఇకపై రూ.72,778కే కొనుగోలు చేయవచ్చు. అంటే కస్టమర్లకు నేరుగా 10% వరకు లాభం దక్కుతుంది.

24
హోండా షైన్ ఇంజన్ వివరాలు

హోండా షైన్‌లో 98.98సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది BS6 2.0 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ఇంజిన్ 7.38PS పవర్, 8.5Nm టార్క్ ఇస్తుంది. 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, మల్టిపుల్ వెట్ క్లచ్‌తో వస్తుంది. ఇంధన ట్యాంక్ సామర్థ్యం 9-10 లీటర్ల వరకు ఉంటుంది.

34
మైలేజీ ఎంత వస్తుంది?

ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వచ్చిన ఈ బైక్ రోజువారీ వినియోగానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కంపెనీ ప్రకారం, ఒక లీటర్ పెట్రోల్‌తో ఈ బైక్ 55 నుంచి 70కిమీ వరకు వెళుతుంది. ఒకసారి ట్యాంక్ నింపితే 600-650కిమీ వరకు ప్రయాణించవచ్చు.

44
ప్రత్యేక ఫీచర్లు

హోండా షైన్‌లో అనలాగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్రిప్ మీటర్ లాంటివి ఉంటాయి. అదనంగా, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, క్రోమ్ మఫ్లర్, స్టైలిష్ హ్యాండిల్‌బార్ వల్ల బైక్ ప్రీమియం లుక్‌లో కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories