ఈ హైబ్రిడ్ కారు.. అందుబాటులోకి వచ్చిందంటే.. మైలేజీ కింగే!

Published : Apr 07, 2025, 09:52 PM IST

కారు కొనాలి అనుకుంటే ఇండియాలో ఎవరికైనా ముందు గుర్తొచ్చే పేరు మారుతీ సుజుకీ. నమ్మకమైన బ్రాండ్, తక్కువ ధర కారణంగా ఈ బ్రాండ్ టాప్ సెల్లర్ గా నిలుస్తోంది. కాంపాక్ట్ క్రాసోవర్ విభాగంలో ఈ కంపెనీ మోడల్ ఫ్రాంక్స్ అత్యధికంగా అమ్ముడవుతోంది. దాంతో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఈ మోడళ్లో హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకురావాలని ప్రయత్నిస్తోంది  మారుతి సుజుకి.

PREV
13
ఈ హైబ్రిడ్ కారు.. అందుబాటులోకి వచ్చిందంటే.. మైలేజీ కింగే!
రికార్డు అమ్మకాలు

మిడ్ సెగ్మెంట్ విభాగంలో పోటీ పడుతున్న ఈ కారు 2025 ఫిబ్రవరిలో అమ్మకాల్లో రికార్డులు సృష్టించింది. దాంతో త్వరలోనే దీని హైబ్రిడ్ మోడల్ బయటికి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పటికి మార్కెట్లోకి వస్తుందో మాత్రం స్పష్టంగా చెప్పలేదు. 

23
మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్

మారుతి కంపెనీకి ఓవరాల్ గా  అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లు బాలెనో, స్విఫ్ట్ కార్లు. వీటికి కూడా హైబ్రిడ్ వెర్షన్లు వస్తాయని గతంలో నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. వీటితోపాటు ఫ్రాంక్స్ హైబ్రిడ్ మోడల్ ను తీసుకొస్తారని ఆటోమొబైల్ పండితులు అంచనా వేస్తున్నారు.  ఒకవేళ ఈ మోడల్ అందుబాటులోకి వస్తే మైలేజీ ఎవరూ ఊహించని విధంగా లీటరుకి 35 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

33
ఎలక్ట్రిక్ కారు కూడా

హైబ్రిడ్ కారు ఎప్పుడు వస్తుందో స్పష్టమైన సమాచారం లేకపోయినా.. 2027లో ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయడానికి కూడా మారుతి సుజుకి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories